Ads
హిందువులు ఏ పూజ చేసిన మొదట విఘ్నాలకు అధిపతి విఘ్నేశ్వరుడికి పూజ చేసి గాని పనులు ప్రారంభించరు. ఎటువంటి శుభకార్యం జరిగిన మొదటి ప్రాధాన్యత విఘ్నేశ్వరుడికి ఇస్తారు. ఈయనను గణపతి, వినాయక అంటూ రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఇక భారత దేశంలో వినాయక చవితి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. అయితే భారతదేశంలో ఉన్న అతి పురాతన గణపతి ఆలయాలు ఎక్కడున్నాయి… వాటి విశిష్టత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం…!
1. సిద్ధి వినాయక ఆలయం: ముంబైలో ఉన్న సిద్ధివినాయక ఆలయం అత్యంత ప్రసిద్ధి చెందినది అత్యంత ప్రాచీనమైనది. ఈ ఆలయాన్ని 1801 సంవత్సరంలో నిర్మించారు. ఈ ఆలయాన్ని సందర్శించడానికి దేశ విదేశాలు నుండి కూడా భక్తులు వస్తారు.సినీ ప్రముఖులు, సెలబ్రిటీలు సైతం ఈ సిద్ధి వినాయకున్ని దర్శించుకుంటారు.
2.ఖజ్రాన గణేష్ ఆలయం: ఈ ఆలయం మధ్యప్రదేశ్లోని ఇండోర్ లో ఉంది. ప్రతిరోజు ఈ ఆలయంలో గణేశున్ని 10,000 మంది పైగా భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. భక్తులు తమ కోర్కెలు నెరవేర్చుకోవడానికి ఈ ఆలయంలో గణేశుడు వెనకాల తలకిందులుగా నిలబడి స్వస్తిక్ ను వేస్తే కోరిక నెరవేరుతుందని ఇక్కడ భక్తుల విశ్వసిస్తారు. కోరిక నెరవేరిన తర్వాత నేరుగా గణేషుడి వెనకాల స్వస్తిక్ ను గీస్తారు.
Ads
3. త్రినేత్ర గణేష్ ఆలయం:ఈ ఆలయం రాజస్థాన్లోని సవాయి మాధోపూర్ జిల్లాలో ఉంది. ఈ ఆలయంలో గణేశుడు త్రినేత్ర రూపంలో ఉంటాడు. ఇక్కడ వినాయకుడి మూడవ కన్ను జ్ఞానానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. దేశంలోని నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు ఈ ఆలయానికి వచ్చి దర్శనం చేసుకుని తమ కోరికలు నెరవేరాలని కోరుకుంటారు. తనను దర్శించే భక్తుల కోరికలన్నీ వినాయకుడు తీరుస్తాడని నమ్మకం. గణేశుడు తన మొత్తం కుటుంబంతో ఈ ఆలయంలో పూజలను అందుకుంటున్నారు. ఇద్దరు భార్యలు సిద్ధి, బుద్ధి లతో పాటు ఇద్దరు కుమారులతో కలసి కొలువుదీరాడు. త్రినేత్రుడై గణేశుడు పూజలను అందుకుంటున్న ఏకైక ఆలయం ప్రపంచంలో ఇది ఒక్కటే కావడం విశేషం.
4. దొడ్డ గణపతి ఆలయం: ఈ ఆలయం కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో ఉంది. దక్షిణ భారతదేశంలో అత్యంత అందమైన ఆలయాల్లో ఇది ఒకటి. దొడ్డ అంటే పెద్దది అని అర్థం పేరుకు తగ్గట్టుగానే ఇక్కడ 16 అడుగుల వెడల్పు 18 అడుగుల పొడుగు వినాయకుడి విగ్రహం ఉంటుంది.
5. చింతామన్ గణేష్:మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఉన్న చింతామణ్ గణేష్ ఆలయం అతిపెద్దది. ఈ ఆలయంలో ఉన్న గణేష్ విగ్రహం స్వయంభుగా వెలసింది.పురాతన కాలంలో గణేశుడిని చింతాహరణుడు అని పిలిచేవారట. అంటే అన్ని రకాల చింతలను తొలగించేవాడని అర్ధం. ఇక్కడ దర్శనం కోసం వచ్చే భక్తులతో నిత్యం రద్దీగా ఉంటుంది. దేశ నలు మూలాలు నుండి ఈ ఆలయానికి భక్తులు వస్తారు.