ఎన్టీఆర్-చరణ్ లాగా అక్కినేని వారసులు ఎందుకు సక్సెస్ అవ్వలేకపోయారు.? ఏకైక కారణం ఇదే.!

Ads

ఏ ఇండస్ట్రీలో అయినా వారసత్వం అనేది తరతరాలుగా వస్తున్న ఆచారం. అయితే సినిమాలలో అది మరీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే సినిమాలు ద్వారా వచ్చే ఫేమ్, ఇచ్చే కిక్ వేరే రేంజ్ లో ఉంటాయి. నాగేశ్వరరావు వారసత్వంగా నాగార్జున, ఎన్టీఆర్ వారసత్వంగా బాలకృష్ణ, హరికృష్ణ ఇలా చాలామంది వారసులు వచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే కొందరు వారసులు వారసత్వం పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చినా ఒకటి రెండు సినిమాలతోనే వెనక్కి వెళ్ళిపోతున్నారు.

కొందరు మాత్రం తాత తండ్రుల వారసత్వాన్ని నిలబెట్టుకుని ఆ స్టార్డం ని ఎంజాయ్ చేస్తున్నారు.
కృష్ణంరాజు వారసుడిగా వచ్చిన ప్రభాస్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నాడు. అలాగే మెగాస్టార్ వారసుడు రామ్ చరణ్, సీనియర్ ఎన్టీఆర్ మనవడిగా, హరికృష్ణ కొడుకుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్ టాప్ హీరోగా దూసుకుపోతున్నారు అదే వారసత్వంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాగార్జున కొడుకులు నాగచైతన్య, అఖిల్ మాత్రం సరియైన హిట్లు లేక కుదేలు అయిపోయారు.

Ads

తండ్రి సపోర్టు ఉన్నప్పటికీ వాళ్లు ఇండస్ట్రీలో నిల తొక్కుకోకపోవటానికి కారణం ఏమిటా అని ప్రేక్షకులు ఆరా తీయడం మొదలు పెట్టారు. అయితే వాళ్లు గ్రహించిన నిజం ఏమిటంటే నాగార్జున వారసులు కథ ఎంచుకోవడంలో సరియైన అవగాహన లేక ఎప్పుడూ మూస పద్ధతిలోనే సినిమాలు చేస్తుండటం వలన వాళ్లు సరైన హిట్ అందుకోలేకపోతున్నారు. అందులోనూ నాగచైతన్య అయితే ఆ మాత్రం నటించగలడు కానీ అఖిల్ ముఖంలో అయితే హావ భావాలే పలకవు.

ఫీలింగ్స్ పలకని ఫేస్ అది అంటూ అందరూ ట్రోల్స్ చేసిన సంగతి తెలిసిందే. అటువంటప్పుడు కథలో కొత్తదనం కనిపిస్తే ప్రేక్షకులు పెద్దగా పట్టించుకునే వారు కాదు. మొత్తానికి అక్కినేని వారసులు మాత్రం పెద్దగా స్టార్డం ని నిలబెట్టుకోలేకపోయారని చెప్పాలి. వీళ్లే కాదు ఇంకా ఎస్వీ రంగారావు మనవడు, అలనాటి మేటి నటుడు హరనాధ్ వారసుడు కూడా ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేకపోయారు.

Previous articleఈరోజుల్లో పెళ్లిళ్లు ఇలాగే ఉన్నాయా? అమ్మాయిలందరూ ఇలానే చేస్తే అబ్బాయిల పరిస్థితి ఏంటి?
Next articleదేశంలో అతి పురాతన 5 గణపతి ఆలయాలు ఎక్కడ ఉన్నాయో తెలుసా….?
Mounikasingaluri is a Content Writer who Works at the Prathidvani Website. She has 2+ years of experience, and she has also worked at various Telugu news websites. She Publishes Latest Telugu Updates and Breaking News in Telugu, Movies Updates and Other Viral News.