Ads
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) పరీక్ష దేశంలోనే అత్యంత కఠినమైన ప్రవేశ పరీక్షలలో ఒకటి మాత్రమే కాకుండా అత్యంత ప్రతిష్టాత్మకమైన వాటిలో కూడా ఒకటి. కఠినమైన పరీక్షలను క్లియర్ చేసి ప్రభుత్వ సేవలలో చేరాలనే ఉద్దేశ్యంతో వేలాది మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటారు.
Ads
అయితే వారిలో కొద్దిమంది మాత్రమే అర్హత సాధిస్తున్నారు. ప్రతి ఏడాది ఈ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే ఔత్సాహిక అభ్యర్థులు, ఉత్తీర్ణులైన అభ్యర్థుల నుండి స్ఫూర్తిని కోరుకుంటారు. అలాగే వారు ఎలా ప్రిపేర్ అయ్యారు అనే వాటిని తెలుసుకోవాలని అనుకుంటారు. ఈ క్రమంలో ఒకే ఏడాది ఐఏఎస్ సాధించిన సిస్టర్స్ గురించి ఇప్పడు చూద్దాం..
న్యూ ఢిల్లీకి చెందిన అంకితా జైన్, వైశాలి జైన్ అనే అక్కాచెల్లెలు యూపీఎస్సీ 2020 సంవత్సరంలో క్లియర్ చేసారు. ఐఏఎస్ కావాలనే లక్ష్యాన్ని సాధించి, వార్తల్లో నిలిచారు. అలా వారు ఐఏఎస్ కావాలనుకునే చాలా మందికి ఇన్స్పిరేషన్ గా నిలిచారు. వీరిద్దరు ఒకే నోట్స్ చదువుతూ యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యారు. ఇద్దరిలో అంకితా జైన్ 3వ ర్యాంక్ తెచ్చుకోగా, వైశాలి జైన్ 21వ ర్యాంక్ ను సాధించారు.
ఈ అక్కాచెల్లెళ్లు యూపీఎస్సీకి సిద్ధం అయ్యే టైమ్ లో ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకున్నామని చెబుతున్నారు. యూపీఎస్సీలో అంకితా జైన్ 4వ ప్రయత్నంలో విజయం సాధించింది. ప్రస్తుతం ముంబైలో ఇండియన్ ఆడిట్ మరియు అకౌంట్స్ సర్వీస్ ఆఫీసర్‌గా చేస్తోంది. ఆమె మహారాష్ట్రలో ఐపీఎస్ ఆఫీసర్ అభినవ్ త్యాగిని పెళ్లి చేసుకుంది.
వైశాలి జైన్ అక్కలాగే మొదటి ప్రయత్నంలో యూపీఎస్సీ సాధించలేకపోయారు. ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీ లో బీటెక్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసి, ఓ ప్రైవేట్ కంపెనీలో చేరారు. అలా జాబ్ చేస్తూ సివిల్స్ కోసం చదివింది. అక్కాచెల్లెళ్లు ఇద్దరు ఒకే మెటీరియల్ చదివి 2020 లో యూపీఎస్సీ సాధించారు. వీరి పరీక్షలకు ముందు కోవిడ్ -19 బారిన పడ్డారు. దాంతో వారి కుటుంబం చాలా ఆందోళన చెందింది. అయితే ఇద్దరు చాలా ధైర్యంగా ఉండి, అనుకున్నది సాధించారు. వీరి సక్సెస్ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్లు మరిన్ని విజయాలు అందుకోవాలని కామెంట్లు చేస్తున్నారు.
Also Read: ఏంటి ఈ హల్వా సెరిమొనీ..? దీనికి ఇంత ప్రాధాన్యత ఇవ్వడానికి కారణం ఏంటి..?