Ads
చాలా మంది ఎక్కువగా ప్రతి రోజు షూ వేసుకుంటూ ఉంటారు. ఆఫీస్ కి వెళ్లే వాళ్ళు కాలేజీకి వెళ్లే వాళ్ళు ఇలా రెగ్యులర్ గా షూ వేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ కొంత మంది సాక్సులు లేకుండా షూ ని వేసుకుంటూ ఉంటారు. ఒక్కొక్క సారి సాక్సులు ఉతకకపోయినా కనపడకపోయినా మనం కూడా ఈ తప్పును చేస్తూ ఉంటాము.
నిజానికి సాక్స్ వేసుకోకుండా షూ వేసుకుంటే కొన్ని రకాల సమస్యలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
మరి సాక్స్ వేసుకోకుండా షూ వేసుకుంటే ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. మనం ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి లేకపోతే లేని పోని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆరోగ్యం లేదంటే ఏమీ లేదు. కాబట్టి ఎప్పుడూ కూడా ఆరోగ్యానికి సంబంధించి తప్పులు చేయకూడదు. ఒకవేళ కనుక ఆరోగ్యానికి సంబంధించిన తప్పులు చేశారంటే నష్ట పోవాల్సిందే మీరే. మరి సాక్సులు వేసుకోకుండా షూ ని ధరిస్తే ఎటువంటి ఇబ్బందులు పడాల్సి వస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
Ads
ఎలాంటి సమస్యలు వస్తాయనేది చర్మ వ్యాధి నిపుణుడు ఎమ్మా స్టీఫెన్సన్ చెప్పారు. సాక్సు వేసుకోకుండా షూ వేసుకోవడం వలన కొన్ని ఇబ్బందులు వస్తాయట. 18 నుండి 25 సంవత్సరాల వయస్సు వున్నా పురుషులు ఈ తప్పు ని చేస్తే చర్మ వ్యాధులు సంభవించే అవకాశం వుంది. కాబట్టి ఎప్పుడు ఈ తప్పు చెయ్యద్దు. మనకి రోజుకు 300 మిల్లీ లీటర్ల చెమట పడుతుంది. చెమట, వేడి వలన వచ్చే తేమ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ని కలిగిస్తుంది. దీనితో ఇబ్బంది పడాల్సింది మీరే. ఫ్యాషన్ అని మీరు సాక్సులని వేసుకోక పోతే లేనిపోని బాధలు పడాల్సి వస్తుంది.