Ads
అయోధ్యలో రామమందిరం ప్రారంభం అయిన విషయం తెలిసిందే. బాలక్ రాముడి ప్రాణప్రతిష్ట తరువాతి రోజు నుండి సాధారణ ప్రజలకు అనుమతించారు. ఈ నేపథ్యంలో రామమందిరాన్ని, బాలక్ రాముడి దర్శనం చేసుకోవడానికి వస్తున్న భక్తులతో అయోధ్య కిటకిటలాడుతోంది.
భక్తులు అయోధ్యకు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. జనవరి 29 వరకు రాముడిని సుమారు 19 లక్షల మంది దర్శించుకున్నట్టు తెలుస్తోంది. అయోధ్యకు భారీ సంఖ్యలో వస్తున్నవారి ఆకలిని తీర్చడం కోసం నగరంలో పలు రెస్టారెంట్లు వెలిశాయి. అయితే త్వరలో కేఎఫ్‌సీ ఔట్‌లెట్ లు అయోధ్యలో ఓపెన్ చేయనున్నట్టు వార్తలు రావడంతో జిల్లా యంత్రాంగం స్పందించింది.
ఇప్పటికే అయోధ్యలో డొమినోస్, పిజ్జా హట్ లాంటి ఫుడ్ రెస్టారెంట్లు ఏర్పాటూ చేశారు. కానీ అందులో వెజ్ ఫుడ్ మాత్రమే అందిస్తూ తమ బిజినెస్ నడుపుతున్నాయి. ఇక రామ మందిర ప్రాంతం చుట్టూ 15 కిలోమీటర్ల తీర్థయాత్ర సర్క్యూట్ అయిన పంచ్ కోసి మార్గ్‌లో మద్యం లేదా మాంసాహార వస్తువుల అమ్మకాలను నిషేధించింది. రామమందిర శంకుస్థాపన చేయకముందే, రాష్ట్ర ప్రభుత్వం మాంసం అమ్మే షాప్స్ ని క్లోజ్ చేయాలని ఆదేశించింది.
Ads
భక్తుల సంఖ్య పెరగడంతో వారి అవసరాలు తీర్చడానికి వ్యాపారులు షాప్స్ తెరుస్తున్నారు. ఆలయ సమీపంలో రెస్టారెంట్లు, హోటళ్లు కూడా వెలుస్తున్నాయి. ఇక్కడ వెజ్ రెస్టారెంట్లు మాత్రమే నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే కేఎఫ్‌సీ తమ ఔట్‌లెట్ ఓపెన్ చేయబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తల పై స్పందించిన జిల్లా అధికారి పూర్తి వెజ్ ఫుడ్ తో కేఎఫ్సీ ఔట్‌లెట్ నిర్వహిస్తే, అందుకు స్థలం సైతం ఇవ్వడానికి సిద్ధం అని వెల్లడించారు.
“అయోధ్యలో KFCతో సహా అన్ని బ్రాండ్‌లు తమ అవుట్‌లెట్‌లను తెరవడానికి స్వాగతం పలుకుతాయి. అయోధ్య ప్రాంతంలో మాంసాహారం మరియు మద్యం అందించడం మరియు అమ్మడం పై నిషేధం ఉన్న ప్రాంతంలో వారు తమ అవుట్‌లెట్‌లను తెరిస్తే, వారు శాఖాహారాన్ని విక్రయించాల్సి ఉంటుంది. అయోధ్యలోని మిగిలిన ప్రాంతంలో ఎలాంటి పరిమితి లేదు” అని అయోధ్య జిల్లా మేజిస్ట్రేట్ నితీష్ కుమార్ తెలిపారు.
Also Read: అయోధ్య రాముడిని దర్శించుకోవాలనుకుంటున్నారా..? ఇదిగో సులభ మార్గాల వివరాలు!