”త్రివిక్రమ్” మొదటి సినిమా ఏది..? ఆ సినిమా అడ్వాన్స్ తో ఏం చేసారో తెలుసా..?

Ads

మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. త్రివిక్రమ్ చాలా అద్భుతమైన సినిమాలను తెర మీద కి తీసుకు వచ్చారు. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ లో అగ్ర దర్శకులు లో ఒకరుగా పేరు సంపాదించారు త్రివిక్రమ్.

పైగా చాలా మంది హీరోలు త్రివిక్రమ్ దర్శకత్వం లో సినిమా చేయాలని కూడా చూస్తూ ఉంటారు. అయితే త్రివిక్రమ్ గురించి చాలా మందికి ఈ ముఖ్య విషయాలు తెలియవు.

అసలు త్రివిక్రమ్ తీసిన మొట్ట మొదటి సినిమా ఏది…? ఆ సినిమాతో వచ్చిన అడ్వాన్స్ ని ఆయన ఏం చేశారు అనేది ఈరోజు తెలుసుకుందాం. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మొట్ట మొదట తెర మీదకి వచ్చిన సినిమా నువ్వే నువ్వే. ఈ సినిమాలో తరుణ్ హీరోగా నటించారు. శ్రీయ హీరోయిన్ గా నటించారు. ఈ చిత్రాన్ని స్రవంతి రవి కిషోర్ నిర్మించారు. స్రవంతి మూవీస్ పతాకంపై ఈ సినిమా వచ్చింది. ఈ సినిమాలో చంద్రమోహన్, రాజీవ్ కనకాల, తనికెళ్ల భరణి, ప్రకాష్ రాజ్, సునీల్ మొదలైన నటీ నటులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా వచ్చి దాదాపు 20 ఏళ్లు పూర్తయింది.

Ads

రచయితగా ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమా తో దర్శకుడిగా మారారు. ఆయన దర్శకుడిగా సినిమా తీసుకురావడానికి కారణం రవి కిషోర్ అని ఆయన చెప్పారు. పైగా ఎన్ని సార్లు కృతజ్ఞతలు చెప్పినా సరే తక్కువేనని త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పారు. వనమాలి హౌస్ లో నువ్వే కావాలి సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు రవి కిషోర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ నడుస్తూ మాట్లాడుకుంటున్నప్పుడు ఈ సినిమా కథ చెప్పారట. వెంటనే ఆయన చెక్ చేసి కొంత అమౌంట్ త్రివిక్రమ్ కి ఇచ్చేసారట. ఆ డబ్బుతో త్రివిక్రమ్ శ్రీనివాస్ బైక్ కొనుక్కున్నారట. అప్పట్లో నువ్వే నువ్వే సినిమా ఒక మంచి హిట్ ని అందుకుంది.

Previous article“లాల్ సలామ్” తెలుగు ట్రైలర్ లో “రజినీకాంత్” కి మనో బదులు ఆ హీరో డబ్బింగ్..! అసలు సెట్ అవ్వలేదు కదా..?
Next articleఅయోధ్యలో కేఎఫ్‌సీ పెట్టడం ఏంటి..? ఇది ఎలా సాధ్యం..?