సినిమాల అవకాశాలు లేవు… కానీ కోట్లల్లో సంపాదన..! ఈ హీరోయిన్ ప్లానింగ్ మామూలుగా లేదుగా..?

Ads

సినిమాల్లో పాపులర్‌ అయిన హీరోయిన్లు బాగా సంపాదిస్తారనే విషయం అందరికీ తెలిసిందే. సినిమా రంగంలో పాటు ఇతర రంగాలలో కూడా సంపాదిస్తున్న హీరోయిన్లు చాలామంది ఉన్నారు. కొందరు హీరోయిన్లు కొన్నేళ్ళు సినిమాలలో నటించిన తరువాత ఇండస్ట్రీకి దూరం అవుతున్నారు.

కొందరు అవకాశాలు లేక దూరం అయితే, కొందరు పెళ్లి చేసుకుని, సినిమాలకు దూరం అవుతున్నారు. అలా ఇండస్ట్రీకి దూరం అయిన ఓ హీరోయిన్ అవకాశాలు లేక పోయినా కోట్లలో సంపాదిస్తోంది. ఆమె ఎవరో ఇప్పుడు చూద్దాం..
నటుడు విజయకుమార్, అలనాటి హీరోయిన్ మంజుల కుమార్తెగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ప్రీతా విజయకుమార్ మొదటి సినిమాతో మంచి గుర్తింపును, విజయాన్ని అందుకున్నారు. 1998లో రుక్మిణి అనే తెలుగు మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో పలు సినిమాలలో నటించింది. నరసింహ మూవీలో రజనీకాంత్‌ కూతుర్లలో ఒకరిగా నటించిన ప్రీత మరింత పాపులర్‌ అయ్యారు. 

Ads

ఆ తరువాత తెలుగులో క్షేమంగా వెళ్లి లాభంగా రండి, మా అన్నయ్య, ప్రియమైన నీకు, వైఫ్ లాంటి పలు  సినిమాలలో నటించారు. హీరోయిన్ గా ఉన్నప్పుడే 2002లో డైరెక్టర్ హరిని పెళ్లి చేసుకుని, ఇండస్ట్రీకి దూరం అయ్యారు. ఈ జంటకి ముగ్గురు కుమారులు. సినిమాలకు దూరంగా ఉన్న ప్రీత సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ప్రీతా తన అక్క నటి శ్రీదేవితో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది. ప్రీతా విజయ్ కుమార్ వ్యాపార రంగంలో రాణిస్తూ కోట్లలో సంపాదిస్తోందని ఇటీవల వార్తలు వచ్చాయి. ఆమె చైన్నె సముద్రతీరంలో ప్రీత ప్యాలెస్‌ అనే పేరుతో కల్యాణ మండపాన్ని నిర్మించారు. దాని దగ్గరలోనే మెట్రో కాఫీ హౌస్‌ ను ప్రారంభించారు. దీనిలో పనిచేసే వాళ్లంతా మహిళలే. ఇక మద్రాస్‌ కాఫీ పేరుతో పలు ప్రాంచైజీలు ఇప్పటికే ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా స్థానిక సాలిగ్రామంలోని మూవీ ఎడిటింగ్‌ మరియు డబ్బింగ్‌ స్టూడియోను కూడా నిర్వహిస్తున్నారు. ఇలా ఆమె భారీ ఆదాయాన్ని సంపాదిస్తున్నారు.

Also Read: LAL SALAAM REVIEW : సూపర్ స్టార్ “రజినీకాంత్” తన కూతురి దర్శకత్వంలో నటించిన ఈ సినిమా ఎలా ఉంది..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

Previous articleగుప్పెడంత మనసు సీరియల్ లో ఇండైరెక్ట్ గా “ముఖేష్ గౌడ” కి కౌంటర్ ఇచ్చారా..? ఈ డైలాగ్ అలాగే ఉంది కదా..?
Next articleసీత పాత్రకి సాయి పల్లవిని తీసేసి యాక్టింగ్ రాని ఈ హీరోయిన్ ని తీసుకున్నారా..? ఎవరంటే..?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.