LAL SALAAM REVIEW : సూపర్ స్టార్ “రజినీకాంత్” తన కూతురి దర్శకత్వంలో నటించిన ఈ సినిమా ఎలా ఉంది..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

Ads

సూపర్ స్టార్ రజినీకాంత్ ముఖ్య పాత్రలో, ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో వచ్చిన సినిమా లాల్ సలామ్. ఈ సినిమా ఇవాళ విడుదల అయ్యింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

  • చిత్రం: లాల్ సలామ్
  • నటీనటులు: రజనీకాంత్, విష్ణు విశాల్, విక్రాంత్.
  • దర్శకుడు: ఐశ్వర్య రజనీకాంత్
  • సంగీతం: ఎ.ఆర్. రెహమాన్
  • నిర్మాత : సుభాస్కరన్
  • రిలీజ్ డేట్ : ఫిబ్రవరి 9, 2024

lal salaam review

కథ:

తిరు (విష్ణు విశాల్), షంషుద్దీన్ (విక్రాంత్) కి చిన్నప్పటి నుండి ఒకరు అంటే ఒకరికి పడదు. క్రికెట్ లో కూడా వీరి శత్రుత్వం అలాగే కొనసాగుతుంది. ఇది వారి ఊరంతా కూడా వ్యాపిస్తుంది. షంషుద్దీన్ తండ్రి మొయిదీన్ భాయ్ (రజినీకాంత్). అయితే మొయిదీన్ భాయ్ త్రీ స్టార్ టీం అనే ఒక క్రికెట్ టీంని ఏర్పాటు చేస్తాడు. ఇందులోనే తిరు, షంషుద్దీన్ ఆడతారు. అయితే తిరు అంటే పడని వాళ్ళు అతనిని టీంలో నుండి బయటికి వెళ్లేలాగా చేస్తారు. అప్పుడు తిరు ఎంసిసి అనే ఒక జట్టుని ఏర్పాటు చేస్తాడు.

lal salaam review

దాంతో క్రికెట్ టీమ్స్ ప్రాతినిధ్యం వహించే తీరు కూడా మారిపోతాయి. హిందువులకి, ముస్లింలకి మధ్య ప్రాతినిధ్యం వహించే జట్లలాగా అవి ఉంటాయి. దాంతో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య క్రికెట్ జరుగుతున్నట్టు ఆ ఊరి వాళ్లు అనడం మొదలు పెడతారు. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఊరిలో ఇలాంటి చర్చలు మొదలవుతాయి. తర్వాత ఏం జరిగింది? వాళ్లు ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? మొయిదీన్ భాయ్ ఏం చేశాడు? తిరుతో మాట్లాడి గొడవలు పరిష్కరించాడా? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.

lal salaam review

విశ్లేషణ:

సినిమా కోసం దర్శకురాలు ఐశ్వర్య రజినీకాంత్ తీసుకున్న స్టోరీ పాయింట్ బాగుంది. ఐశ్వర్య రజినీకాంత్ అంతకుముందు దర్శకత్వం వహించిన సినిమాల్లో కూడా ఆమె ఎంచుకున్న స్టోరీ పాయింట్ బాగుంటుంది. కానీ టేకింగ్ పరంగా మాత్రం చాలా తప్పులు జరుగుతూ ఉంటాయి. చాలా చోట్ల సీన్స్ ఆసక్తికరంగా అనిపించవు. ఇప్పుడు ఈ సినిమా విషయంలో కూడా జరిగింది అదే. స్టోరీ పాయింట్ బాగుంది. టెక్నికల్ గా బాగుంది. కానీ ఆసక్తి కలిగించేలాగా చాలా తక్కువ సీన్స్ ఉంటాయి.

lal salaam review

Ads

సినిమా అలా వెళుతూ ఉంటుంది. ఒక్కచోట కూడా సీన్ స్ట్రాంగ్ గా అనిపించదు. కొన్ని సీన్స్ అయితే చాలా సాగదీసినట్టు ఉంటాయి. ఒక్కొక్కసారి ఎప్పుడు అయిపోతాయా అని ప్రేక్షకులు అనుకుంటారు. ఈ సినిమా తమిళ్ లో చాలా థియేటర్లలో విడుదల అయ్యింది. కానీ తెలుగులో మాత్రం ఇచ్చిన థియేటర్లలో జనాలు నిండకపోవడంతో షోస్ క్యాన్సిల్ చేశారు. ఇప్పటికే రజనీకాంత్ పాత్రకి తెలుగులో సాయికుమార్ డబ్బింగ్ చెప్పడం మీద చాలా కామెంట్స్ వస్తూ ఉన్నాయి.

lal salaam review

సినిమాలో హిందూ ముస్లిం అనే ఒక విషయం గురించి మాట్లాడారు. కానీ అసలు ఆమె చెప్పాలి అనుకున్న పాయింట్ అనేది స్పష్టంగా చెప్పలేకపోయారు. ముఖ్యంగా సినిమా రన్ టైం అయితే చాలా పెద్దగా అనిపిస్తుంది. ఎడిటింగ్ పరంగా ఇంకా జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సినిమాలో ఉన్న వాళ్ళు అందరూ తమ పాత్రలకి తగ్గట్టు చేశారు.

lal salaam review

చాలా రోజుల తర్వాత జీవిత రాజశేఖర్ కూడా ఒక మంచి పాత్రలో నటించారు. మిగిలిన వాళ్ళు అందరూ కూడా తమ పాత్రల పరిధి మేరకు నటించారు. ఎ.ఆర్. రెహమాన్ అందించిన పాటలు బాగున్నాయి. విష్ణు రంగసామి అందించిన సినిమాటోగ్రఫీ డీసెంట్ గా ఉంది. కొన్ని సీన్స్ మాత్రం ఇంకా బాగా రాసుకొని, ఎడిటింగ్ కూడా ఇంకా బాగుంటే సినిమా ఇంకా ఎక్కువ ఆసక్తికరంగా ఉండే అవకాశం ఉండేది.

ప్లస్ పాయింట్స్:

  • భారీ తారాగణం
  • పాటలు
  • స్టోరీ పాయింట్
  • నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్:

  • బలహీనంగా ఉండే స్క్రీన్ ప్లే
  • సినిమా నిడివి
  • ఎడిటింగ్
  • టేకింగ్

రేటింగ్:

2.5/5

ఫైనల్ గా:

సినిమా నుండి పెద్దగా ఏమీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా, ఏదైనా ఒక సినిమా చూద్దాం అనుకునే వారికి, కేవలం రజనీకాంత్ కోసం సినిమా చూద్దాం అనుకునే వారికి లాల్ సలామ్ సినిమా ఒక్కసారి చూడగలిగే యావరేజ్ సినిమాగా నిలుస్తుంది.

watch trailer :

ALSO READ : ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ హీరో పేరే వినిపిస్తోంది..! ఇతను ఎవరో తెలుసా..?

Previous articleEAGLE REVIEW : “రవితేజ” కి ఈ సినిమాతో హిట్ పడినట్టేనా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!
Next articleగుప్పెడంత మనసు సీరియల్ లో ఇండైరెక్ట్ గా “ముఖేష్ గౌడ” కి కౌంటర్ ఇచ్చారా..? ఈ డైలాగ్ అలాగే ఉంది కదా..?