Ads
మణికందన్,గౌరీ ప్రియ హీరో హీరోయిన్లుగా, ప్రభురామ్ వ్యాస్ దర్శకత్వంలో తమిళంలో లవర్ అనే సినిమా తెరకెక్కింది. అదే సినిమాని తెలుగులో ట్రూ లవర్ గా డబ్ చేశారు దర్శకుడు మారుతి, నిర్మాత ఎస్ కే ఎన్. తమిళంలో ఫిబ్రవరి 9న రిలీజ్ అయితే తెలుగులో ఫిబ్రవరి 10న రిలీజ్ అయింది. ట్రూ లవర్ సినిమాకి పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేయడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. అలాగే టీజర్, ట్రైలర్ కూడా ఆసక్తి పెంచే విధంగా ఉండటంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సినిమా ఎలా ఉందో ఓ లుక్కేద్దాం.
- చిత్రం : ట్రూ లవర్
- నటీనటులు : మణికందన్, శ్రీ గౌరీ ప్రియ, కన్నా రవి, శరవణన్.
- నిర్మాత : నజెరత్ పసిలియన్, మగేష్ రాజ్ పాసిలియన్, యువరాజ్ గణేశన్
- దర్శకత్వం : ప్రభురామ్ వ్యాస్
- సంగీతం : సీన్ రోల్డాన్
- విడుదల తేదీ : ఫిబ్రవరి 10, 2024
స్టోరీ :
దివ్య( గౌరీ ప్రియ ), అరుణ్( మణికందన్ ) ఇద్దరూ కాలేజీ రోజుల నుంచి ప్రేమించుకుంటూ ఉంటారు. ప్రస్తుతం దివ్య సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తూ ఉంటే అరుణ్ మాత్రం కాఫీ షాప్ పెట్టే ప్రయత్నంలో ఉంటాడు.అయితే ఎక్కడ దివ్య తన కొలీగ్స్ తో ప్రేమలో పడిపోతుందో అని పొసెసివ్ గా ఫీల్ అవుతూ ఉంటాడుఅరుణ్. అతని అనుమానం తట్టుకోలేక ఎక్కడికి వెళ్తున్నది, ఏం చేస్తున్నది అరుణ్ కి చెప్పటానికి ఇష్టపడదు దివ్య. అయితే ఫ్రెండ్స్ తో బయటికి వెళ్లిన ప్రతిసారి అరుణ్ కి దొరికిపోవడం, అరుణ్ రాద్ధాంతం చేయడం తర్వాత సారీ చెప్పటం, కలిసిపోవడం సర్వసాధారణమైపోతూ ఉంటుంది.
అలాంటి సమయంలో దివ్య కోసం ఉద్యోగంలో చేరుతాడు అరుణ్.కాఫీ షాప్ పనుల్లో తిరగటం వలన ఉద్యోగం నిర్లక్ష్యం చేయడంతో అతని ఉద్యోగం పోతుంది. ఈ విషయం దివ్యకి చెప్పకుండా మేనేజ్ చేసే సమయంలో దివ్యకి నిజం తెలిసిపోతుంది. దాంతో దివ్యకి అరుణ్ కి మళ్ళీ గొడవ ప్రారంభం అవుతుంది. దివ్య మీద అరుణ్ కి అంత అనుమానం కలగటానికి కారణం ఏమిటి? నిజం తెలుసుకున్న దివ్య, అరుణ్ తో గొడవ పడిందా? చివరికి వారి ప్రేమ కథ ఏమైంది? ఇలాంటివన్నీ సినిమాలో చూడాల్సిందే. ఈ సినిమా ట్రూ లవర్స్ కి నిజంగానే కనెక్ట్ అవుతుంది.
రివ్యూ :
Ads
అబ్బాయి పొసెసివ్నెస్, అమ్మాయి చిరాకు సినిమాలో ఎక్కువగా కనిపిస్తాయి. ఎంతసేపూ అమ్మాయి బాధపడినట్లే చూపిస్తాడు కానీ అబ్బాయి వైపు బాధని కన్వే చేయడంలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యారు అంటున్నారు ప్రేక్షకులు. డైరెక్టర్ కి ఇది మొదటి సినిమా అయినప్పటికీ సినిమా బాగా తీశాడు అందుకు సంగీతం కూడా బాగా సెట్ అయింది నటీనటులు కూడా వారి పరిధి మేరకు బాగా నటించారు. మొత్తానికి ఈ సినిమాకి 3 రేటింగ్ ఇవ్వచ్చు.
హీరో తనలో తాను ఎదుర్కొనే ఒత్తిడి గురించి అంత ఎక్కువగా చూపించలేదు. హీరోకి పొసెసివ్ నెస్ ఉంది. కానీ అలా ఉండడానికి కారణం ఏంటి? దాని వల్ల అతను తనలో తనే ఎంత ఇబ్బంది పడ్డాడు? ఈ విషయాలను కూడా ఇంకా కొంచెం క్లియర్ గా చూపించి ఉంటే బాగుండేది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, కబాలి, తమిళ్ డబ్బింగ్ సినిమా అయిన గుడ్ నైట్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు మణికందన్. ఈ సినిమాలో తెలుగులో కూడా తనే డబ్బింగ్ చెప్పుకున్నారు. అరుణ్ పాత్రలో మణికందన్ చాలా బాగా నటించారు.
దివ్య పాత్రలో హీరోయిన్ శ్రీ గౌరీ ప్రియ కూడా బాగా నటించారు. మిగిలిన వాళ్ళు అందరూ కూడా తమ పాత్రలకి తగ్గట్టు చేశారు. సీన్ రోల్డాన్ అందించిన పాటలు కూడా బాగున్నాయి. శ్రేయస్ కృష్ణ సినిమాటోగ్రఫీ సహజంగా ఉంది. కానీ సినిమా స్లోగా నడుస్తుంది. వాళ్ల మధ్య ఉన్న గొడవలని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయడం కోసం దర్శకుడు కాస్త సమయం తీసుకున్నారు. దాంతో కొన్ని సీన్స్ మాత్రం కాస్త నిడివి ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ లో ఇలాంటి సీన్స్ చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఇలాగే ఆ ఎపిసోడ్ నిడివి ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తాయి.
ప్లస్ పాయింట్స్ :
- నటీనటుల పర్ఫార్మెన్స్
- సహజంగా చూపించిన కొన్ని సీన్స్
- డైలాగ్స్
- బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
మైనస్ పాయింట్స్:
- తెలిసిన కథ
- ల్యాగ్ గా అనిపించే కొన్ని సీన్స్
రేటింగ్ :
3/5
ట్యాగ్ లైన్ :
ప్రేమ కథలు చాలానే వస్తాయి. కానీ రియల్ లైఫ్ కి దగ్గరగా ఉన్న కథలు మాత్రం కొన్ని మాత్రమే వస్తాయి. ఇది కూడా అలాంటి ఒక సినిమా. కథనం నుండి పెద్దగా కొత్తదనం ఆశించకుండా, ఒక మంచి సినిమా చూద్దాం అనుకునే వారికి ట్రూ లవర్ సినిమా ఒక్కసారి చూడగలిగే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ సినిమాగా నిలుస్తుంది.
watch trailer :