30 ఏళ్ల క్రితమే.. చిరంజీవి సినిమా టిక్కెట్ ధర ఎంత రేంజ్ కి వెళ్లిందో తెలుసా..? వైరల్ అవుతున్న న్యూస్ పేపర్ క్లిప్పింగ్..!

Ads

పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి సినీ బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి, ఒక్కో మెట్టు ఎక్కుతూ తనని తాను యాక్టర్ గా మలుచుకుంటూ స్వయంకృషితో అగ్రహీరో ఎదిగారు. సిల్వర్ స్క్రీన్ పై నటన, డాన్స్, ఫైట్లతో ఆకట్టుకుని కమర్షియల్‌ హీరోగా నెంబర్ వన్ స్థానంలో నిలిచారు.

సుప్రీం హీరో నుంచి మెగాస్టార్‌ గా ఎదిగిన చిరంజీవి గత ముప్పై సంవత్సరాలుగా తెలుగు సినిమాని  శాషిస్తున్నాడు. ఈతరం హీరోలకు పోటీగా నటిస్తూ, తన క్రేజ్‌, రేంజ్‌ ఎంత మాత్రం తగ్గలేదని, వరుస సినిమాలలో నటిస్తూ రాణిస్తున్నారు. తాజాగా 30 ఏళ్ల క్రితం మెగాస్టార్ చిత్రాల రేంజ్ ను తెలిపే పేపర్‌ కటింగ్ ఒకటి నెట్టింట్లో వైరల్‌ గా మారింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
చిరంజీవి తన సినీ కెరీర్ ను 1978లో పునాదిరాళ్లు సినిమాతో ప్రారంభించారు. అయితే, ప్రాణం ఖరీదు అదే ఏడాది బాక్సాఫీస్ వద్ద ముందుగా రిలీజ్ అయ్యింది. 1978-1981 వరకు ఇతర హీరోలతో ఆకలిసి నటించారు. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య మూవీతో సోలో హీరోగా మారారు. వరుస సినిమాలతో నటిస్తూ అగ్రహీరోగా ఎదిగారు. ఆయన నటించిన ఘరానా మొగుడు బాక్సాఫీస్ వద్ద రూ. 10 కోట్ల కంటే ఎక్కువ వసూలు చేసిన మొదటి తెలుగు సినిమాగా నిలిచింది.

Ads

అదే ఏడాది వచ్చిన ఆపద్బాంధవుడు సినిమాకి చిరంజీవి రూ. 1.25 కోట్ల పారితోషికం తీసుకుని సంచలనం సృష్టించాడు. ఇది ఆ సమయంలో  ఏ భారతీయ నటుడికైనా అత్యధిక పారితోషికం. ముప్పై ఏళ్ల క్రితం చిరంజీవి క్రేజ్‌ పీక్‌లో ఉండేది. బాలకృష్ణ, వెంకటేష్‌, నాగార్జున లాంటి హీరోలున్నప్పటికి చిరంజీవి తెలుగులో నెంబర్ వన్ హీరోగా రాణించారు. చిరంజీవికి ఫ్యాన్ ఫాలోయింగ్‌ ఈ రేంజ్ లో ఉండేది.
అప్పట్లో చిరంజీవి మూవీ టికెట్‌ రేటు ఏకంగా 800 రూపాయలు పలకడం అటు మెగస్టార్ ని ఇండస్ట్రీ వర్గాలను కూడా ఆశ్చర్యపరిచింది. ముఠామేస్త్రీ 1993 జనవరి 17న విడుదల అయ్యింది. ఓ అభిమాని ఒక్క టికెట్‌ ను ఆరోజుల్లోనే రూ. 800లకు కొనుగోలు చేశాడు. ఆ రేట్‌ ఇప్పుడు ఇప్పుడు ఎనభై వేలు ఉండవచ్చు. దీనికి సంబంధించిన ఒక న్యూస్ పేపర్‌ కటింగ్ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read: నందమూరి బాలకృష్ణ పెళ్లి పత్రిక చూసారా..? ఏం రాసి ఉందంటే..?

Previous articleరోజా సెల్వమణి “ప్రేమ కథ” తెలుసా..? వీరి పరిచయం ఎలా మొదలయ్యింది అంటే..?
Next articleపుష్ప-2 పాటలో మిస్ అయిన లాజిక్..! ఈ మిస్టేక్ ఎలా చేసారు..?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.