Ads
నందమూరి నటసింహం బాలకృష్ణ అగ్రహీరోగా కొన్ని దశాబ్దాల నుండి తెలుగు ఇండస్ట్రీలో దూసుకెళ్తున్నారు. ఆరు పదుల వయసులోనూ యంగ్ హీరోలతో పోటీ పడుతూ, వరుస సినిమాలలో నటిస్తున్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో హ్యట్రిక్ విజయన్ని అందుకున్నారు.
Ads
ఈ సినిమాలు ఒకదాన్ని మించి మరొకటి వసూళ్ల వర్షం కురిపించాయి. బాలయ్య తదుపరి సినిమా బాబీతో చేస్తున్నారని తెలుస్తోంది. ఈ మూవీ ఎన్బీకే 109 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతుంది. తాజాగా బాలకృష్ణ పెళ్లి పత్రిక నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
బాలకృష్ణ బాల్యం అంతా హైదరాబాదులోనే గడిచింది. నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తిచేశారు. 1974లో బాలకృష్ణ పద్నాలుగు సంవత్సరాల వయసులో తాతమ్మకల సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. మొదట్లో పలు చిత్రాలలో సహాయనటుడిగా కనిపించాడు. 1984లో సాహసమే జీవితం మూవీలో తొలిసారిగా హీరోగా చేశారు. వరుస సినిమాలలో నటిస్తూ, ఎన్నో విజయాలు అందుకున్న బాలకృష్ణ టాలీవుడ్ లో అగ్రహీరోలలో ఒకరిగా కొనసాగుతున్నారు.
తాజాగా బాలయ్య పెళ్లి పత్రిక సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాలకృష్ణకు వసుంధరా దేవితో పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. 1982లో డిసెంబర్ 8న వీరి పెళ్లి జరిగింది. వీరి వివాహం జరిగి 41 సంవత్సరాలు. ఆ రోజుల్లో మీడియా ఎక్కువగా లేని కారణంగా, సామాజిక మాధ్యమాలు లేకపోవడం వల్ల ఈ పెళ్లి పత్రిక గురించి సన్నిహితులకు మాత్రమే తెలుసు. కానీ సోషల్ మీడియా వచ్చిన తరువాత పాత విషయాలు కూడా అందరికీ చేరువ అవుతున్నాయి. ఈ పెళ్లి పత్రికను వసుంధరా దేవి ఫ్యామిలీ ప్రింట్ చేయించారు.
ఈ కార్డ్ లో దేవరపల్లి సూర్యారావు మరియు దేవరపల్లి ప్రమీలారాణిల ద్వితీయ కుమార్తె వసుంధరా దేవిని, పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి పంచమ పుత్రుడు బాలకృష్ణకు ఇచ్చి పెళ్లి చేయిస్తున్నట్లుగా ఉంది. తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలోని కర్నాటక కళ్యాణ మండపంలో వీరి పెళ్లి జరిగింది. బాలకృష్ణ పెళ్లి బాధ్యతని ఎన్టీఆర్ నాదెండ్ల భాస్కరరావుకి అప్పగించారు. ఆయనే బాలకృష్ణకి ఈ సంబంధం కుదిర్చినట్టు చెబుతుంటారు.
Also Read: యష్ మొదలు మృణాల్ ఠాకూర్ వరకు.. సీరియల్స్ నుండి సినిమాల్లోకి వచ్చిన 10 మంది నటులు వీళ్ళే..!