Ads
సినిమా విడుదల అయిన చాలా రోజుల తర్వాత ఓటీటీలోకి వచ్చిన సినిమా ది కేరళ స్టోరీ. నిజ జీవితంలో జరిగిన ఒక సంఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. ఇందులో హీరోయిన్ ఆదా శర్మ ఒక పాత్రలో నటించారు. ఈ సినిమాని 15 నుండి 20 కోట్లు బడ్జెట్ తో రూపొందించారు.
ఈ సినిమా 303.97 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాకి సుదీప్తో సేన్ దర్శకత్వం వహించారు. ఇందులో అదా శర్మతో పాటు, యోగితా బిహానీ, సోనియా బలానీ, సిద్ధి ఇద్నానీ కూడా కీలక పాత్రలు పోషించారు. సినిమా విడుదల అయ్యాక ఈ సినిమా మీద ఎన్నో కామెంట్స్ వచ్చాయి.
ఎన్నో వివాదాలు జరిగాయి. సినిమాలో నటించిన వారి మీద కూడా కామెంట్స్ వచ్చాయి. అందుకే అన్ని వివాదాలు ఉండడం వల్ల ఈ సినిమా డిజిటల్ రిలీజ్ తొందరగా అవ్వలేదు. దాంతో ఇప్పుడు అవన్నీ క్లియర్ అయ్యాక ఓటీటీలోకి వచ్చింది. దాంతో ఇప్పుడు ఈ సినిమాని చూసి కామెంట్స్ చేస్తున్న వాళ్ళ సంఖ్య ఇంకా పెరిగిపోయింది. సోషల్ మీడియా అంతా కూడా ఈ సినిమా మీద కామెంట్స్ చేస్తున్నారు. ఇందులోనూ ముఖ్యంగా ఒక సీన్ మీద కామెంట్స్ చేస్తున్నారు.
Ads
నలుగురు హీరోయిన్స్ లో ఒక హీరోయిన్ హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడుతుంది. దేవుళ్ళ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు, ఆ విషయం గురించి చెప్తూ, హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడుతూ వాళ్ళు ఇలా చేశారు అంటూ చెప్తుంది. వాళ్ళని దేవుళ్ళుగా ఎలా కొలుస్తారు అని అంటుంది. ఈ సీన్ మీద సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.
“ఇలాంటి సీన్ ఎలా రాశారు?” అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ సినిమాలో అదా శర్మ షాలిని ఉన్నికృష్ణన్ అనే పాత్రలో నటించారు. ఆమె మలయాళం లో మాట్లాడాలి. మలయాళం వాళ్లు ఈ సినిమా చూసి, “అదా శర్మ మాట్లాడిన మలయాళం సరిగ్గా లేదు” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దాంతో ప్రస్తుతం సోషల్ మీడియా అంతటా కూడా ఈ సినిమా గురించి చర్చ జరుగుతోంది. సినిమా చూసి కామెంట్స్ చేస్తున్నారు.