సలార్ లో ప్రభాస్ తల్లిగా నటించిన “ఈశ్వరి రావు” కి… ప్రభాస్ కి మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Ads

సినిమా అన్నాక ప్రతి నటుడు తమ పాత్రలకి తగ్గట్టు రెడీ అవుతారు. సినిమాల్లో ఒక్కొక్కసారి వయసుకి మించిన పాత్రలు వేయాల్సి వస్తుంది. చిన్న వయసు ఉన్నవారే తల్లుల పాత్రలో, అక్కల పాత్రలో నటిస్తూ ఉంటారు. అదే ఇటీవల వచ్చిన సలార్ సినిమా విషయంలో కూడా జరిగింది.

ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాలో ఈశ్వరి రావు ప్రభాస్ కి తల్లి పాత్రలో నటించారు. ఈశ్వరి రావు నటన బాగుంది అంటూ సినిమా చూసినవాళ్లు ప్రశంసించారు. అయితే, ఒకసారి వీరిద్దరి వయసు చూసుకుంటే, ప్రభాస్ వయసు ఇప్పుడు 44 సంవత్సరాలు.

ఈశ్వరి రావు వయసు ఇప్పుడు 50 సంవత్సరాలు. ఇద్దరికీ ఆరు సంవత్సరాలు వయసు తేడా. నిజంగా చూసుకుంటే వీళ్ళిద్దరూ అక్క తమ్ముళ్ల పాత్రలు చేయాలి. కానీ ఈ సినిమాలో ఈశ్వరి రావు ప్రభాస్ తల్లి పాత్ర పోషించారు. ఇలాంటివి కొత్త ఏమీ కాదు. అంతకు ముందు కూడా చాలానే జరిగాయి. ఈశ్వరి రావు ఈ మధ్య చాలా సినిమాల్లో తల్లుల పాత్రలు పోషిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో కూడా నటించారు. కానీ వయసు తేడా మాత్రం తక్కువ. ఇటీవల వచ్చిన గుంటూరు కారం సినిమాలో కూడా మహేష్ బాబు, రమ్యకృష్ణ వయసు తేడా ఐదు సంవత్సరాలు మాత్రమే.

Ads

minus points in salaar trailer

కానీ ఏదైనా సరే, ఇది ఆ నటుల పాత్రల ఎంపికలను బట్టి ఉంటుంది. ఆ పాత్రకి వారు నప్పుతారు అనుకుంటే వారిని ఆ పాత్రలో ఎంచుకుంటారు. వారికి కూడా పాత్ర నచ్చితేనే ఆ నటులు ఈ పాత్ర చేయడానికి అంగీకరిస్తారు. ఈశ్వరి రావు పాత్ర సినిమాలో ఒక ముఖ్య పాత్ర. అసలు ఆమె ఈ పాత్ర అంగీకరించడానికి కారణం ఏంటి అనేది మనకి తెలిసిపోతుంది. సినిమా చూస్తున్నంత సేపు కూడా వారిద్దరికీ కేవలం ఆరు సంవత్సరాలు వయసు తేడా అనేది తెలియదు. ఎందుకంటే వారిద్దరి వేషధారణ అలా ఉంటుంది.

ఇంక ఈ సినిమా విషయానికి వస్తే, ఈ సినిమాలో ఈశ్వరి రావు కథని ముందుకు నడిపించే ఒక పాత్రలో నటించారు. అసలు ఆమె తన కొడుకుని అంతగా కాపాడుకోవడానికి కారణం ఏంటి అనేది మనకి చూపించలేదు. ఆమెకి ఇలా ప్రవర్తించడానికి కారణం కొన్ని గత జ్ఞాపకాల ప్రభావాలు అని మాత్రమే మనకి అర్థం అవుతుంది. మరి ఆమె పాత్ర అలా ప్రవర్తించడానికి కారణం ఏంటి అనేది తెలియాలి అంటే నెక్స్ట్ పార్ట్ వరకు వేచి చూడాల్సిందే.

Previous article“ఇలాంటి సీన్ ఎలా రాశారు..? దేవుళ్ళని ఇలా అనడం ఏంటి..?” అంటూ… “ది కేరళ స్టోరీ” మూవీ మీద కామెంట్స్..!
Next article1983 వరల్డ్ కప్ టైంలో భారత ఆటగాళ్ల సాలరీలు ఎంతో తెలుసా.? వైరల్ అవుతున్న లిస్ట్.!