Ads
హీరోలు అన్న తర్వాత ఎన్నో రకమైన సినిమాలు చేస్తారు. కానీ కొంత మంది హీరోలు మాత్రం రీమేక్ సినిమాలకి దూరంగా ఉంటారు. ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో అలా రీమేక్ సినిమాలు చేయము అని అనుకున్న హీరోలు ఉన్నారు. వారిలో మొదటి వరుసలో ఉండే నటుడు మహేష్ బాబు.
మహేష్ బాబు రీమేక్ సినిమాలు చేయను అని చెప్పేశారు. ఒక హీరో చేసేసిన సినిమాని తాను చేస్తే ప్రజలకి కూడా అంగీకరించడం కష్టం అవుతుంది అని, పోలికలు వస్తాయి అని, దాంతో ఇలాంటి ఆలోచనలు అన్నీ ఉంటాయి అనే కారణంగా రీమేక్ సినిమాలకి మహేష్ బాబు దూరంగా ఉంటున్నట్టు ఒక సందర్భంలో అన్నారు. అయితే, మహేష్ బాబు హీరోగా నటించిన చాలా సినిమాలు ఇతర భాషల్లో రీమేక్ అయ్యాయి.
ఒక్కడు, పోకిరి, దూకుడు ఇలా ఎన్నో సినిమాలు మిగిలిన భాషల్లో రీమేక్ అయ్యి హిట్ అయ్యాయి. కొంత మంది హీరోలకి అయితే వారి కెరీర్ లోనే గుర్తుండిపోయే సినిమాలు అయ్యాయి. పోకిరి చాలా భాషల్లో రీమేక్ చేశారు. తమిళ్ లో పొక్కిరి పేరుతో రీమేక్ చేశారు. హిందీలో వాంటెడ్ పేరుతో సల్మాన్ ఖాన్ హీరోగా ఈ సినిమా రూపొందింది. తమిళ్ లో విజయ్ హీరోగా నటించారు. అటు విజయ్ కి, ఇటు సల్మాన్ ఖాన్ కి, ఇద్దరికీ కెరీర్ లో సూపర్ హిట్ సినిమాలు అయ్యాయి. మహేష్ బాబు హీరోగా నటించిన ఒక్కడు సినిమాని కూడా తమిళ్ లో విజయ్ రీమేక్ చేశారు.
ఇది కూడా విజయ్ కెరీర్ లో ఒక గుర్తుండిపోయే సినిమా అయ్యింది. ఈ సినిమాని తమిళ్ లో గిల్లి పేరుతో రీమేక్ చేశారు. ధరణి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. తెలుగులో భూమిక నటించిన హీరోయిన్ పాత్రలో తమిళ్ లో త్రిష నటించారు. అయితే ప్రకాష్ రాజ్ పాత్రని మాత్రం తమిళ్ లో కూడా ప్రకాష్ రాజ్ పోషించారు. విద్యాసాగర్ ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహించారు. అప్పట్లో ఈ సినిమా 50 కోట్లు సాధించింది. అయితే ప్రస్తుతం ట్విట్టర్ లో విజయ్ అభిమానులకి, తెలుగు హీరోల అభిమానులకి మధ్య గొడవ జరుగుతోంది.
Ads
“మా హీరో గొప్ప” అంటే, “మా హీరో గొప్ప” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో గిల్లి సినిమాలోని ఒక సీన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వచ్చింది. అందులో ప్రకాష్ రాజ్ హీరోయిన్ ని తీసుకువెళ్లిపోతూ ఉంటే, పక్కన నుండి హీరో వెళ్లాలి. తెలుగులో మహేష్ బాబు, భూమి,క ప్రకాష్ రాజ్ ఉన్న ఈ సీన్ చాలా సాధారణంగా ఉంటుంది. కానీ తమిళ్ లో లిబర్టీ తీసుకొని కొంత యాడ్ చేసి, ఇందులో హీరో జాగింగ్ చేస్తున్నట్టు చూపించారు. అయితే, దీని మీద కామెంట్స్ రావడానికి ముఖ్య కారణం ఏంటి అంటే, హీరో చలి తగ్గడానికి వేసుకునే ఒక జాకెట్ వేసుకొని జాగింగ్ చేస్తూ ఉంటారు.
అది కూడా మధ్యాహ్నం ఎండగా ఉన్నప్పుడు జాగింగ్ చేస్తున్నారు. దాంతో ఇది చూసిన తెలుగు వాళ్ళు అందరూ కూడా, “మిట్ట మధ్యాహ్నం జాకెట్ వేసుకొని జాగింగ్ చేయడం ఏంటి?” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ తమిళ్ వాళ్లు మాత్రం, “మా హీరో చాలా బాగా చేశారు” అని పొగుడుతున్నారు. కానీ, “ఒకవేళ పోల్చి చూస్తే మాత్రం తెలుగుదే నయం అనిపిస్తుంది. చాలా సింపుల్ గా తీశారు. కానీ తమిళ్ లో అలా యాడ్ చేయడం వల్ల తెలుగులో ఒక్కడు సినిమా బాగా చూసిన వాళ్ళకి మాత్రం ఆ సీన్ అంత పెద్దగా ఎక్కదు” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
watch video :