రెండేళ్ల క్రితం రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయ్యింది… ఇప్పుడు రీ-రిలీజ్ అవుతోంది..! ఈ సినిమా ఏంటో తెలుసా..?

Ads

ఏదైనా సినిమా హిట్ అయితే, ఆ సినిమా రిలీజ్ అయ్యి చాలా సంవత్సరాలు అయితే దాన్ని మళ్లీ రిలీజ్ చేయడం ఈమధ్య ఒక ట్రెండ్ అయిపోయింది. చాలా పెద్ద హీరోల సినిమాలు అలాగే రీ-రిలీజ్ అవుతున్నాయి. యంగ్ హీరోల సినిమాలు కూడా ఒకవేళ అవి క్లాసిక్ సినిమాలు అయితే మళ్లీ రిలీజ్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఒక ఫ్లాప్ అయిన సినిమాని మళ్లీ రిలీజ్ చేస్తున్నారు. ఆ సినిమా పేరు రౌడీ బాయ్స్. దిల్ రాజు మేనల్లుడు ఆశిష్ ఈ సినిమాలో హీరోగా నటించారు.

flop movie re releasing

ఇదే ఆశిష్ మొదటి సినిమా. అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో నటించారు. శ్రీ హర్ష కోనుగంటి ఈ సినిమా దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద దిల్ రాజు ఈ సినిమాని నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ సినిమాకి సంగీతం అందించారు. ఎంతో మంది పెద్దపెద్ద టెక్నీషియన్స్ ఈ సినిమాకి పనిచేశారు. 2022 లో సంక్రాంతి కానుకగా ఈ సినిమాని విడుదల చేశారు. కానీ ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని పొందలేదు. అలాంటిది ఇప్పుడు ఈ సినిమాని మళ్లీ రిలీజ్ చేస్తున్నారు.

Ads

flop movie re releasing

ఏప్రిల్ 25వ తేదీన ఈ సినిమాని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్ లో ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. అయితే, ఈ సినిమా టీవీలో వచ్చినప్పుడు కూడా అంత పెద్ద హిట్ అవ్వలేదు. ఓటీటీలో రిలీజ్ అయినప్పుడు కూడా అంత పెద్దగా ఆదరణ లభించలేదు. అలాంటిది మళ్లీ ఈ సినిమాని ఎందుకు విడుదల చేస్తున్నారు అనేది అర్థం కాని విషయం.

flop movie re releasing

ఆశిష్ హీరోగా నటించిన లవ్ మీ సినిమా మేలో విడుదల అవుతుంది. సినిమా టీజర్ ఇటీవల విడుదల చేశారు. ఈ సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తున్నారు. దయ్యంతో ప్రేమ అని కాన్సెప్ట్ మీద ఈ సినిమా రూపొందించారు. టీజర్ కొత్తగానే అనిపిస్తోంది. సినిమాకు సంబంధించి ఇప్పటికే రెండు పాటలు విడుదల చేశారు. అందులో ఒక పాటని సినిమాలో హీరోయిన్ వైష్ణవి చైతన్య పాడారు.

ALSO READ : ఫ్యామిలీ స్టార్ సినిమాలో విజయ్ దేవరకొండ బామ్మగా నటించిన ఈ మహిళ ఎవరో తెలుసా..?

Previous articleఈ సంవత్సరం వచ్చిన బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ అంటే ఇదే..! అసలు ఏం ఉంది ఇందులో..?
Next article“తెలుగు” ఒక్కడు Vs “తమిళ్” ఒక్కడు..! వీళ్ళిద్దరిలో ఏ హీరో బాగా చేశారంటే..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.