Ads
కొంత మంది భార్యలు వాళ్ళ భర్తలతో ఫ్రీగా ఏదైనా విషయాన్ని చెప్పేస్తుంటారు. కానీ కొంత మంది భార్యలు మాత్రం వాళ్ళ భర్త ఏమంటారు అని కొన్ని విషయాలని దాచేస్తూ ఉంటారు. ఇది ఎవరి ఇష్టం వాళ్ళది. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళ భర్త రియాక్షన్ ఎలా ఉంటుందో వారికి తెలుసు కాబట్టి కొన్ని విషయాలని చెప్పకుండా దాచేస్తూ ఉంటారు. కొంతమంది భర్తలు చాలా కూల్ గా ఉంటారు.
అటువంటి వాళ్ళకి ఎటువంటి విషయాన్నైనా చెప్పొచ్చు అని ఈజీగా అన్ని విషయాలని షేర్ చేసుకుంటూ వుంటారు కొంత మంది భార్యలు.
కానీ నిజానకి భార్య భర్తల మధ్య దాపరికాలు ఉండకూడదు. అయినప్పటికీ చాలా మంది ఎక్కువగా భర్త తో చెప్పకుండా చాలా విషయాలని దాచేస్తూ ఉంటారు. అయితే ఈ విషయాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంత మంచి భర్త అయినా సరే భార్య చెప్పడానికి ఏ మాత్రం ఇష్ట పడదు. చెప్పదు. మరి ఏ విషయాన్ని భర్తతో చెప్పకుండా దాచేస్తూ ఉంటారు భార్యలు అనేది ఇప్పుడు చూద్దాం.
Ads
భర్తతో భార్య వీటిని అస్సలు చెప్పదు:
#1. దాచుకునే డబ్బులు:
కొంతమంది భార్యలు డబ్బులు దాస్తు ఉంటారు ఈ విషయాన్ని భర్తకి అసలు చెప్పరు. ఖర్చు చేయకుండా ఉంచి అవసరం వచ్చినప్పుడు కుటుంబానికి పనికి వస్తాయని భార్య డబ్బుని దాస్తూ ఉంటుంది.
#2. అనారోగ్యం కలిగితే:
భార్యకి ఏదైనా సమస్య కలిగితే ఆ విషయాన్ని అసలు భర్తకు చెప్పదు. అనారోగ్య సమస్యలని భార్య దాచిస్తూ ఉంటుంది. అనారోగ్య పరిస్థితి గురించి చెప్తే భర్త ఎక్కడ కంగారు పడతారు అని భార్య చెప్పకుండా ఓపికగా ఉంటుంది.
#3. ఆందోళన లేదా సమస్య ఏదైనా:
ఇబ్బందిగా వున్నా ఆందోళనకరంగా అనిపించినా సరే భార్య ఆ విషయాలను ఆమె భర్తకు చెప్పదు.
#4. ప్రేమ కలిగితే చెప్పదు:
భర్త మీద ఎంత ప్రేమ కలిగినా సరే భార్య చెప్పదు. భార్య అంతరంగాన్ని భర్తే గ్రహించి నడుచుకోవాలి.