కార్తీకదీపం-2 స్టోరీ ఏంటో తెలుసా..? ఆ సీరియల్ కి రీమేక్..?

Ads

తెలుగు టెలివిజన్ చరిత్రలోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన సీరియల్స్ లో, ఇటీవల లిస్ట్ లో చేరిన సీరియల్ కార్తీకదీపం. ఎటువంటి అంచనాలు లేకుండా టెలికాస్ట్ అయ్యి, ఆ తర్వాత టాప్ సీరియల్ గా గుర్తింపు సంపాదించుకుంది. దాదాపు 4 సంవత్సరాల పాటు నడిచిన ఈ సీరియల్ ఇటీవల ముగిసింది.

అప్పుడు చాలా మంది సీరియల్ అయిపోయినందుకు బాధపడ్డారు. ఇప్పుడు కార్తీకదీపం పార్ట్ 2 వస్తున్నట్లు చెప్పారు. దానికి సంబంధించిన ప్రోమో కూడా ఇటీవల విడుదల చేశారు. అయితే, కార్తీకదీపం పార్ట్ 2 అంటే మొదటి కార్తీకదీపం సీరియల్ కి కొనసాగింపు లాగే ఉంటుంది అని అనుకున్నారు.

karthika deepam 2 story telugu

కానీ ప్రోమో చూస్తే మాత్రం అలా అనిపించట్లేదు. కార్తీకదీపంలో నటించిన నిరుపమ్, ప్రేమీ విశ్వనాథ్ ఈ ప్రోమోలో కనిపిస్తున్నారు. కానీ ప్రోమో స్టోరీ మాత్రం డిఫరెంట్ గా అనిపిస్తుంది. వీరితో పాటు మరొక చిన్న పిల్ల కూడా కనిపిస్తోంది. అయితే కార్తీకదీపం పార్ట్ 2 సీరియల్ ఒక సీరియల్ రీమేక్ అని సమాచారం. తమిళ్ లో ఇప్పటికే ప్రసారం అయ్యి సూపర్ హిట్ అయిన చెల్లమ్మ అనే సీరియల్ రీమేక్ అనే వార్త వినిపిస్తోంది.

Ads

karthika deepam 2 story telugu

ఊరిలో నివసించే ఒక మహిళ, తన కూతురిని ఎలా కాపాడుకుంది. ఇలాంటి విషయాల మీద ఈ సీరియల్ నడుస్తుంది. పెళ్లి అయ్యాక భర్త పెట్టే ఇబ్బందులు భరించలేక విడాకులు తీసుకున్న ఒక మహిళ, ఆమెకి ఒక కూతురు, ఇంకొక పెళ్లి చేసుకున్న భర్త, ఆమెని ఇబ్బంది పెట్టడం, ఈ సీరియల్ కథ అంతా కూడా ఇలా నడుస్తుంది. మెయిన్ క్యారెక్టర్ ఒకరి ఇంట్లో పని మనిషిగా పని చేస్తూ ఉంటుంది. వారు తన కూతురి చదువు కోసం సహాయం చేస్తారు.

karthika deepam 2 story telugu

విడాకులు తీసుకున్న తర్వాత తాను భర్త నుండి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది, వాటి నుండి తన కూతురిని ఎలా కాపాడుకుంది అనేది ఈ సీరియల్ లో చూపించారు. ఇప్పుడు తెలుగు ప్రోమో చూస్తూ ఉంటే దాదాపు ఇలాగే ఉన్నట్టు అనిపిస్తోంది. మరి డాక్టర్ బాబు ఇందులో ఏ పాత్ర పోషిస్తారు అనేది మాత్రం ఇంకా తెలియదు. ఈ సీరియల్ బ్రహ్మముడి సీరియల్ టైమింగ్ లో వస్తుంది అని అంటున్నారు. ఈ విషయం మీద ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ALSO READ : “రామ్ చరణ్” ఇప్పటి వరకు సంపాదించిన మొత్తం ఎంత..? ఒక్క సినిమాకి ఎంత తీసుకుంటారు అంటే..?

Previous articleఈ 22 తెలుగు డైరెక్ట‌ర్ల భార్యలని ఎప్పుడైనా చూసారా..?
Next articleభార్య ఎట్టిపరిస్థితిలోను భర్తకి ఈ 4 విషయాలని చెప్పదు..! ఎందుకంటే.?