ఆలయంలోని ఆ స్థంభం గాల్లో వేలాడుతూ ఉండడం వెనుక ఇంత పెద్ద కారణం ఉందని మీకు తెలుసా..?

Ads

మన దేశంలో ఎన్నో ప్రసిద్ధి ఆలయాలు ఉన్నాయి. చాలా మంది ఇటువంటి ప్రసిద్ధ ఆలయాలకు వెళుతూ ఉంటారు. విదేశాలలో ఉండే భారతీయులు కూడా మన దేశానికి వచ్చినప్పుడు వారికి నచ్చిన ఆలయాలని సందర్శిస్తూ ఉంటారు. కొన్ని కొన్ని ఆలయాలకి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అటువంటి ఆలయాలకి వెళ్లడం… ఆలయంలో ఉండే భగవంతుడిని దర్శించుకోవడం నిజంగా మన అదృష్టం.

పైగా కొన్ని కొన్ని ఆలయాలకైతే ఘన చరిత్ర కూడా ఉంటుంది. లేపాక్షి ఆలయం గురించి మీరు వినే ఉంటారు. మన దేశ ఆలయాల్లో ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో లేపాక్షి కూడా ఒకటి.

Ads

ముఖ్యంగా లేపాక్షి మన తెలుగు రాష్ట్రాల లో ఉండడం గొప్ప విషయం. లేపాక్షి అనంతపురం నుంచి సుమారు 15 కిలో మీటర్ల దూరంలో ఉంది. 16వ శతాబ్దంలో లేపాక్షి గ్రామంలో దీనిని నిర్మించారు. లేపాక్షి ఆలయంలో వీరభద్ర స్వామి వారు ఉంటారు. లేపాక్షి అనే పేరు ఎందుకు వచ్చింది? దాని వెనుక ఉన్న కథ ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం. రావణాసురుడు సీతాదేవిని తీసుకు వెళ్తున్నప్పుడు జటాయువు అనే పక్షి రావణుడిని ఆపడానికి చూస్తుంది.

రావణాసురుడు తనకు అడ్డం పడిన పక్షిని తన కత్తితో దాడి చేస్తాడు. అప్పుడు ఆ జటాయువు కింద పడిపోతుంది. దాన్ని చూసి రాముడు “లే పక్షి” అని అంటదు. ఇలా ఆ ప్రదేశానికి లేపాక్షి పేరు వచ్చింది. ఇక్కడ ఓ స్థంభం వేలాడుతూ ఉంటుంది. స్థంభానికి నేలకి మధ్యన పావు అంగుళం తేడా ఉందిట. ఇలా ఆ స్తంభం ఉండడానికి కారణం ఏమిటంటే భూకంపాలు వంటివి వస్తే మిగిలిన స్థంభాలన్నీ వాటి స్థానం నుండి కదిలిపోతూ ఉంటాయి. కానీ ఇది మాత్రం కదలకుండా చూస్తుంది. ముందు జాగ్రత్తగా ఈ స్థంభం గాలిలో ఉంటుంది.

Previous articleఈ 14 మంది హాస్యనటుల భార్యలు ఎంత అందంగా ఉన్నారో ఎప్పుడైనా చూసారా?
Next articleఆపిల్ IPHONE లో “I” అంటే ఏమిటి..? ఇంత పెద్ద స్టోరీ ఉందని తెలుసా..?