Ads
టీం ఇండియా క్రికెటర్ హనుమ విహారి చేసిన ఒక పోస్ట్ సంచలనంగా మారింది. గత నెలలో ఆంధ్రా రంజీ జట్టు కెప్టెన్సీ వదులుకున్నారు. అయితే, అప్పుడు హనుమ విహారి బ్యాటింగ్ మీద దృష్టి పెట్టడానికి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అని అన్నారు. కానీ ఇప్పుడు అసలు విషయం బయటకు వచ్చింది.
ఈ విషయం మీద హనుమ విహారి వివరంగా ఒక పోస్ట్ చేశారు. అందులో, “మేము చివరి వరకు గట్టిగా పోరాటం కానీ అనుకున్నది జరగలేదు. ఆంధ్ర తో క్వార్టర్స్ ఓడిపోయాం. ఈ పోస్ట్ నేను మీ ముందు కొన్ని నిజాలు చెప్పడం కోసం షేర్ చేస్తున్నాను.”
“బెంగాల్‌తో జరిగిన మొదటి గేమ్‌లో నేను కెప్టెన్‌గా ఉన్నాను. ఆ గేమ్‌లో నేను 17వ ఆటగాడి మీద అరిచాను. అతను వెళ్లి ఈ విషయాన్ని అతని తండ్రికి చెప్పాడు. ఆయన ఒక రాజకీయవేత్త. అప్పుడు అతని తండ్రి నా మీద చర్య తీసుకోవాలని అసోసియేషన్‌ను కోరారు. ఆ మ్యాచ్ లో బెంగాల్ మీద 410 పరుగులు చేసి గెలిచినా కూడా కెప్టెన్ పదవి నుండి నన్ను రాజీనామా చేయాలి అని చెప్పారు. నా తప్పు ఏమీ లేకపోయినా కూడా కెప్టెన్సీ నుండి తప్పుకోవాలి అని అన్నారు. నేను ఆ ఆటగాడి మీద వ్యక్తిగత ఉద్దేశంతో ఏమి చెప్పలేదు. అయినా కూడా నాకంటే ఆ ప్లేయర్ ముఖ్యం అని అసోసియేషన్ భావించింది.”
“గత సంవత్సరం దెబ్బ తగిలినా కూడా పట్టించుకోకుండా, ఒక్క చేత్తో బ్యాటింగ్ చేసిన ప్లేయర్ కంటే, గత 7 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ని 5 సార్లు నాకౌట్ కి చేర్చిన ప్లేయర్ కంటే, ఈ అసోసియేషన్ కి ఆ ప్లేయర్ ముఖ్యం అయ్యాడు. ఈ సంఘటన వల్ల నేను చాలా ఇబ్బంది పడ్డాను. కానీ నేను ఆ సీజన్లో కొనసాగించడానికి కారణం, నేను నా ఆటకి, నా టీంకి ఇస్తున్న గౌరవం. కానీ అసోసియేషన్ వాళ్లు, ప్లేయర్స్ తాము ఏది చెప్పినా వినాలి అని, అంతే కాకుండా వాళ్ళ కారణంగానే ప్లేయర్స్ ఇవాళ ఈ పొజిషన్ లో ఉన్నారు అని అనుకుంటారు.”
Ads
“దీని వల్ల నాకు చాలా అవమానంగా అనిపించింది. ఇప్పటి వరకు నేను దీని గురించి మాట్లాడలేదు. నా ఆత్మగౌరవాన్ని కోల్పోయిన ఆంధ్ర జట్టు తరఫున ఎప్పటికీ ఆడకూడదు అని నేను నిర్ణయించుకున్నాను. నా జట్టు అంటే నాకు ఇష్టం ప్రతి సీజన్లో మనం ఎదుగుతున్న విధానం నాకు చాలా బాగా అనిపిస్తుంది కానీ మన అసోసియేషన్ మనం ఎదగాలి అని కోరుకోవట్లేదు” అంటూ పోస్ట్ తో పాటు, ఒక ఫోటో కూడా షేర్ చేశారు. అయితే, ఈ విషయం మీద ఆ ప్లేయర్ కూడా స్పందించారు. అతని పేరు పృథ్వీరాజ్.
పృథ్వీరాజ్ సోషల్ మీడియా వేదికగా ఇలా రాశారు, “అందరికీ హలో. ఆ ప్లేయర్ ని నేనే. నాకోసమే మీరు కామెంట్ బాక్స్ లో వెతుకుతున్నారు. మీరు విన్నది అంతా అబద్ధం. ఆట కంటే ఎవరు గొప్ప కాదు. నాకు కూడా నా ఆత్మగౌరవం అన్నిటికంటే ముఖ్యమైనది. వ్యక్తిగతంగా తప్పుగా కామెంట్ చేయడం, లేదా దుర్భాషలాడడం అనేది ఎక్కడైనా సరే అంగీకరించే విషయం కాదు.”
“టీంలో ఉన్న అందరికీ ఏం జరిగింది అనే విషయం తెలుసు. నువ్వు ఇంతకుమించి ఏమీ చేయలేవు మిస్టర్ సో కాల్డ్ ఛాంపియన్. ఈ సింపతి ఆటలు ఎంత కావాలో అంత ఆడుకో” అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేశారు. అయితే, దీనికి బదులుగా హనుమ విహారి కూడా, “ఆ రోజు ఏం జరిగింది అనేది అందరికీ తెలుసు” అంటూ తన టీం నుండి రాసిన ఒక స్టేట్మెంట్ ని షేర్ చేశారు. ఈ విషయం మీద చర్చలు జరుగుతున్నాయి.
ALSO READ : కెప్టెన్ కూల్ ధోని డైట్ ఏమిటి..? అసలు ఏం తింటారో తెలుసా..?