ఇందిరా గాంధీ భర్త అంత్యక్రియలు అలా ఎందుకు జరిగాయి..? “నేను ఫిరోజ్ గాంధీని ఇష్టపడలేదు” అని ఇందిరా గాంధీ ఎందుకు అన్నారు..?

Ads

ఇందిరా గాంధీ భారతదేశపు తొలి మరియు ఏకైక మహిళా ప్రధానమంత్రి. ఇందిరా గాంధీ 1966 -1977 వరకు వరుసగా మూడు సార్లు, 1980లో నాలుగవ సారి ప్రధానమంత్రిగా దేశానికి సేవలందించారు. భారత మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కుమార్తె ఇందిరా గాంధీ.

Ads

ఇందిరా గాంధీ భర్త ఫిరోజ్ గాంధీ పూర్వీకులు పర్షియా నుండి ఇండియాకి వలస వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. వారు పార్సీలు. ఫిరోజ్ గాంధీ మరణించిన తరువాత, హిందూ ఆచారాల ప్రకారం అంత్యక్రియలు జరిపించారు. పార్సీ ఆచారాల ప్రకారం చేయకుండా హిందూ ఆచారాల ప్రకారం ఎందుకు చేశారో ఇప్పుడు చూద్దాం..
indira gandhi husband last ritesబీబీసి న్యూస్ తెలుగు కథనం ప్రకారం, ఫిరోజ్ గాంధీ 48 వ పుట్టినరోజుకు 4 రోజుల ముందే గుండెపోటుతో సెప్టెంబరు 8న వెల్లింగ్టన్ హాస్పిటల్ లో కన్నుమూశారు. ఫిరోజ్ గాంధీ భౌతిక కాయాన్ని హాస్పిటల్ నుండి తీన్ మూర్తి భవన్‌కు తీసుకువచ్చారని కేథరీన్ ఫ్రాంక్ ‘ఇందిర’ పుస్తకంలో వివరించారు.  ఫిరోజ్ గాంధీ భౌతికకాయానికి ఇందిరా గాంధీ స్వయంగా  స్నానం చేయిస్తానని, అంత్యక్రియలకు సిద్ధం చేస్తానని, ఆ టైమ్ లో ఎవరూ అక్కడ ఉండకూడదని, కోరారు.indira gandhi husband last ritesఫిరోజ్ గాంధీ భౌతికకాయాన్ని సెప్టెంబర్ 9 ఉదయం అంత్యక్రియల నిర్వహించడానికి నిగంబోధ్ ఘాట్‌కు తరలించారు. అయితే ఫిరోజ్ గాంధీకి తొలిసారి గుండెపోటు వచ్చిన సమయంలో,  “నా అంత్యక్రియలు హిందూ ఆచారం ప్రకారం జరగాలని కోరుకుంటున్నా” అని తన మిత్రులతో చెప్పారు. అయితే హిందూ సంప్రదాయం ప్రకారం జరిగినా, ఫిరోజ్ గాంధీ భౌతిక కాయాన్ని దహనం చేయడానికి ముందు కొన్ని పార్శీ సంప్రదాయాలను ఇందిర పాటించారు. రాజీవ్ గాంధీ తండ్రి చితికి నిప్పంటించారు.
indira gandhi husband last ritesఫిరోజ్ గాంధీ అంత్యక్రియల్లో హిందూ ఆచారం ప్రకారం వితంతువులు ధరించినట్లే ఇందిర గాంధీ కూడా తెల్ల చీరను  ధరించారు. కానీ, ఫిరోజ్ గాంధీ మరణించిన తరువాత చాలా సంవత్సరాల వరకూ ఇందిరాగాంధీ తెల్లని వస్త్రాలే ధరించేవారు. అయితే తాను వితంతువు అనే కారణంతో తెల్లని వస్త్రాలు ధరించడం లేదని, “ఫిరోజ్ గాంధీ వెళ్లిపోయినప్పుడే, నా లైఫ్ లోని రంగులన్నీ నన్ను విడిచి వెళ్లిపోయాయి” అని అన్నారు.
indira gandhi husband last rites“తనను తీవ్రంగా కుదిపేసింది ఫిరోజ్‌ మరణం. మా తాత, తల్లి, తండ్రి నా కళ్ల ముందే కన్నుమూయడం చూశాను. కానీ, ఫిరోజ్ గాంధీ మరణించడం నన్ను ఘోరంగా కుదిపేసింది” అని ఇందిరా గాంధీ డామ్ మోరెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. “నేను ఫిరోజ్‌ను ఇష్టపడేదాన్ని కాదు. కానీ, ఫిరోజ్‌ ని ప్రేమించేదాన్ని” అని ఇందిర గాంధీ మరోక చోట రాశారు.

ALSO READ : ఉద్యోగం చేయడమా..? ఇంట్లో ఉండడమా..? ఈ కాలం ఆడవాళ్లు ఎక్కువగా ఎలా ఉండడానికి ఇష్టపడుతున్నారు అంటే..?

Previous article“ఈ సింపతి ఆటలు ఆడుకో..!” అంటూ… “హనుమ విహారి” పోస్ట్ కి ఆ ప్లేయర్ కౌంటర్..! ఎవరంటే..?
Next articleపవన్ కళ్యాణ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..? ఎంత వరకు చదువుకున్నారు అంటే..?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.