Ads
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గరికి వచ్చింది. నేతలు ప్రచార కార్యక్రమాల్లో జోరుగా పాల్గొంటున్నారు. నిన్న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3000 మంది నేతలతో జగన్ ఒక భేటీ నిర్వహించారు. అంతకుముందు కూడా క్యాడర్ తో ప్రాంతాల వారీగా సభలు నిర్వహించారు.
వచ్చే ఎన్నికల్లో 175 కి 175 సీట్లు ఎలా గెలుచుకోవాలి అనే విషయం మీద జగన్ మాట్లాడారు. ఇందుకోసం ఎలాంటి చర్యలు చేపట్టాలి అనేది కూడా చెప్పారు. రాబోయే 45 రోజులు చాలా ముఖ్యమైనవి అని జగన్ చెప్పారు.
నేతలు ఓటర్లకి, ప్రజలకి అందుబాటులో ఉండాలి అని, అందులోనూ ముఖ్యంగా పోలింగ్ బూత్ నిర్వహణ, ప్లానింగ్ మీద దృష్టి సారించాలి అని జగన్ నిర్దేశించారు. ప్రతి పోలింగ్ బూత్ లో 60 శాతం ఓట్లు సాధించడం అనే లక్ష్యంతో పనిచేయాలి అని జగన్ చెప్పారు. రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో ఏం జరుగుతున్నాయి అనే విషయాలు అన్నీ కూడా పార్టీ కేంద్ర కార్యాలయం నుండి పర్యవేక్షిస్తున్నాము అని అన్నారు. మేము సిద్ధం-మా బూత్ సిద్ధం అంటూ దీనిపై దృష్టి సారించాలి అన్నారు.
Ads
60 శాతం ఓట్లు సాధించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో అనే విషయం మీద దృష్టి పెట్టాలి అని, ఇందుకు పార్టీ మద్దతు ఉంటుంది అని చెప్పారు. చంద్రబాబు నాయుడులాగా హామీలు ఇచ్చి విస్మరించకుండా, అమలు అయ్యే హామీలు మాత్రమే ఇచ్చి, వాటిని చేసి చూపించాము అని జగన్ చెప్పారు. ఇదే విషయాన్ని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పాలి అని, ఎన్నికలు అంటే వర్గపోరు అని, జగన్ ఉంటేనే సంక్షేమ పథకాలు ఇంకా బాగా కొనసాగుతాయి అని, ఒకవేళ ఓటు వేయకపోతే సంక్షేమానికి ఎలాంటి ప్రభావం పడుతుంది అనే విషయాన్ని హెచ్చరించాలి అని జగన్ చెప్పారు.
ఎమ్మెల్యేలు, ఎసిసిలు అంతా కూడా బూత్ సామర్ధ్యాన్ని తెలుసుకోవాలి అని చెప్పారు. ప్రతి గ్రామ, వార్డు సచివాలయాన్ని ఒక యూనిట్ గా తీసుకొని, ఒక వ్యక్తిని నియమించుకోవాలి అని, ఎల్లప్పుడూ జనానికి అందుబాటులో ఉండేలాగా చూసుకోవాలి అని, అర్థరాత్రి ఫోన్ కాల్ వచ్చినా కూడా సమాధానం చేసే విధంగా ఉండాలి అని చెప్పారు. గృహ సారథులు, స్వయం సేవకులతో కలిసి ఒక సొంత బృందాన్ని తయారు చేసుకోవాలి అని, ప్రతి బూత్ దగ్గర ఉన్న టీంలో 15 నుండి 18 మంది సభ్యులు ఉండాలి అని చెప్పారు. తన సామర్థ్యంతో తాను చేయగలిగినది అంతా కూడా జగన్ చేశాను అని, ఇప్పుడు మీ వంతు అని జగన్ పేర్కొన్నారు.