నాని సినిమాలో నటిస్తున్న ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..? ఈమె బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటంటే..?

Ads

కొంత మంది హీరోయిన్లు వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఉంటారు. మరి కొంత మంది హీరోయిన్లు మాత్రం సెలెక్టివ్ గా సినిమాలు చేస్తారు. ఏడాదికి ఒక సినిమాలో నటించినా కూడా గుర్తుండిపోయే పాత్రలో నటించాలి అని అనుకుంటారు.

అందుకే వారు చేసిన కొన్ని సినిమాలు అయినా కూడా గుర్తింపు మాత్రం స్టార్ హీరోయిన్ కి ఉన్నంత గుర్తింపు ఉంటుంది. వారిలో ఒకరు అదితి బాలన్. అదితి చెన్నైలో లా డిగ్రీ చేశారు. 2015 లో వచ్చిన ఎన్నై ఆరిందాల్ సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించారు.

heroine who is acting with nani

ఇదే సినిమా తెలుగులో ఎంతవాడుగాని పేరుతో విడుదల అయ్యింది. ఇందులో త్రిష స్టూడెంట్స్ లో ఒక స్టూడెంట్ గా కనిపించారు. ఆ తర్వాత 2017 లో వచ్చిన అరువి సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశారు. అసలు మొదటి సినిమాకి అలాంటి ఒక స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న సినిమా చేయడమనేది సాహసం. కానీ మొదటి సినిమా అనే భయం ఒక్కచోట కూడా కనిపించదు. సినిమాలో తన నటనతో కంటతడి పెట్టించారు. ఈ సినిమా తర్వాత తెలుగులో కూడా డబ్ చేశారు.

heroine who is acting with nani

జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సినిమాల్లో ఇది కూడా ఒకటి. ఈ సినిమాకి అదితి ఎన్నో అవార్డ్స్ అందుకున్నారు. ఆ తర్వాత కుట్టి స్టోరీ అనే ఒక ఆంథాలజీలో ఒక సెగ్మెంట్ లో నటించారు. 2021 లో వచ్చిన కోల్డ్ కేస్ సినిమాతో మలయాళం ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టారు. ఈ సినిమా ఆహాలో కూడా తెలుగులో ఉంది. పృథ్వీరాజ్ సుకుమారన్ ఇందులో హీరోగా నటించారు. 2022 లో పడవేట్టు అనే మలయాళం సినిమాలో నటించారు.

Ads

2023 లో శాకుంతలం సినిమాలో ప్రియంవద పాత్రలో నటించారు. కానీ ఈ పాత్రకి ఎక్కువగా గుర్తింపు రాలేదు. తనకి ఇచ్చిన పరిధిలో అదితి తన పాత్రకి న్యాయం చేసేలాగానే నటించారు. ఇటీవల వచ్చిన కెప్టెన్ మిల్లర్ సినిమాలో కూడా ఒక పాత్రలో నటించారు. ఇందులో ధనుష్ హీరోగా నటించారు. ఇప్పుడు నాని హీరోగా నటిస్తున్న సరిపోదా శనివారం సినిమాలో కూడా ఒక పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. ఇది నాని సోషల్ మీడియా అకౌంట్ ద్వారానే ప్రకటించారు.

heroine who is acting with nani

ఇటీవల నాని తన 40వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా అదితి సోషల్ మీడియాలో నానికి విషెస్ తెలిపారు. విషెస్ తో పాటు సరిపోదా శనివారం పోస్టర్ కూడా షేర్ చేశారు అదితి. అందుకు నాని రిప్లై ఇస్తూ, “థాంక్యూ భద్ర” అని చెప్పారు. అంటే ఇందులో అదితి భద్ర అనే పాత్రలో నటిస్తున్నట్టు నాని ప్రకటించారు. అదితి సాధారణంగా తన పాత్రకి ప్రాముఖ్యత ఉన్న సినిమాలు మాత్రమే ఎంచుకుంటారు. మరి ఈ సినిమాలో అదితి పాత్రని ఎలా డిజైన్ చేశారు అనేది తెలియాలి అంటే వెయిట్ చేయాల్సిందే.

Previous article“అనంత్ అంబానీ” కంటే కాబోయే భార్య “రాధిక మర్చంట్” పెద్దవారా..? ఎన్ని సంవత్సరాలు అంటే..?
Next articleప్రతి పోలింగ్ బూత్ లో 60 శాతం ఓట్లు సాధించడానికి… వైయస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన రహస్యం ఏంటో తెలుసా..?
Mounikasingaluri is a Content Writer who Works at the Prathidvani Website. She has 2+ years of experience, and she has also worked at various Telugu news websites. She Publishes Latest Telugu Updates and Breaking News in Telugu, Movies Updates and Other Viral News.