Ads
వెంకటేష్ హీరోగా నటించిన గురు సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నారు రితికా సింగ్. తెలుగులో రితికా సింగ్ చేసిన సినిమాలు తక్కువే. అయినా కూడా మొదటి సినిమాతోనే డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న సినిమా చేయడంతో గుర్తింపు సంపాదించుకున్నారు.
ప్రస్తుతం వరుస పెట్టి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు మాత్రమే చేస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు రితికా సింగ్ మరొక తెలుగు సినిమాలో నటించారు. ఈ సినిమా ఈటీవీ విన్ యాప్ లో విడుదల అయ్యింది. ఈ సినిమా పేరు వళరి.
ఇంక ఈ సినిమా కథ విషయానికి వస్తే నవీన్ (శ్రీరామ్) నేవీలో కెప్టెన్ గా పనిచేస్తూ ఉంటాడు. దివ్య (రితికా సింగ్) నవీన్ భార్య. వీళ్ళకి ఒక కొడుకు ఉంటాడు. నవీన్ కి కృష్ణపట్నం జాబ్ ట్రాన్స్ఫర్ అవుతుంది. కుటుంబం అంతా కూడా అక్కడికి వెళ్ళిపోతారు. నేవీ క్వార్టర్స్ సౌకర్యంగా లేకపోవడంతో, అక్కడే ఉన్న వెంకటాపురం బంగాళకి వీరు షిఫ్ట్ అవుతారు. దివ్యకి కలలో 13 ఏళ్ల ఒక అమ్మాయి తన తల్లిదండ్రులని చంపేస్తున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. ఈ కల దివ్యకి చాలా సార్లు వస్తుంది.
Ads
తర్వాత దివ్య యాక్సిడెంట్ కి గురవుతుంది. దాంతో గతం మర్చిపోతుంది. దివ్యకి రుద్ర (సుబ్బరాజు) అనే సైక్రియాటిస్ట్ చికిత్స అందిస్తూ ఉంటాడు. అసలు దివ్యకి ఆ కల ఎందుకు వచ్చింది. వెంకటాపురం బంగాళాలో ఏం ఉంది. ఇవన్నీ తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే. సినిమాలో ఒక సెన్సిటివ్ విషయం గురించి మాట్లాడారు. సినిమా కోసం డైరెక్టర్ మృతిక సంతోషిని ఎంచుకున్న కాన్సెప్ట్ బాగుంది. అయితే సినిమా ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు ఇది ఒక హారర్ సినిమా అని అనిపిస్తుంది.
కానీ సినిమా మాత్రం హారర్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉన్న సినిమా కాదు. సస్పెన్స్ ఉంటుంది. కానీ హారర్ సినిమా అయితే కాదు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, రితికా సింగ్ కి మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత తెలుగులో ఒక మంచి పాత్ర దొరికింది. ఈ సినిమా కోసం మార్షల్ ఆర్ట్స్ కూడా చేశారు. నవీన్ పాత్రలో శ్రీరామ్, రుద్ర పాత్రలో సుబ్బరాజు కూడా బాగా నటించారు. ఉత్తేజ్ కూడా ఒక ముఖ్య పాత్ర పోషించారు.
ఉత్తేజ్ నటన కూడా బాగుంది. చైల్డ్ ఆర్టిస్ట్ ప్రిన్సెస్ సహస్ర కూడా చాలా బాగా నటించింది. సుజాత సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీ బాగుంది. టి.ఎస్.విష్ణు, హరి గౌర బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకి తగ్గట్టుగా ఉంది. హారర్ అంశాలు ఎక్కువగా ఉంటాయి అని ఆశించకుండా, ఒక థ్రిల్లర్ సినిమా చూడాలి అని అనుకుంటే మాత్రం వళరి సినిమా ఒక్కసారి చూడదగ్గ సినిమాగా నిలుస్తుంది.
ALSO READ : సద్గురు కూడా సినిమాలో నటించారు అని మీకు తెలుసా..? ఏ సినిమాలో అంటే..?