సద్గురు కూడా సినిమాలో నటించారు అని మీకు తెలుసా..? ఏ సినిమాలో అంటే..?

Ads

ఆధ్యాత్మికత గురించి ప్రపంచానికి చాటి చెప్తూ, మానసిక ఆరోగ్యం గురించి కూడా అవగాహన కల్పిస్తున్న వ్యక్తి సద్గురు. ఈషా ఫౌండేషన్ స్థాపించి, ఆధ్యాత్మిక విషయాల గురించి మాత్రమే కాకుండా, యోగ, ధ్యానం వంటివి మనిషి మానసిక ఆరోగ్యానికి ఎంత ఉపయోగపడతాయి అనేది కూడా సద్గురు తన బోధనల ద్వారా ప్రపంచానికి తెలియజేస్తూ ఉంటారు.

సద్గురుకి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. అందులో కూడా సమాజంలో జరిగే ఎన్నో విషయాలు మీతో మాట్లాడుతూ ఉంటారు. ఆయనని అనుసరించే వారి సంఖ్య కూడా కోట్లల్లో ఉంటుంది. ఎంతో మంది సెలబ్రిటీలు కూడా సద్గురు పాఠాలని అనుసరిస్తూ ఉంటారు.

movie in which sadguru appeared

ఆయనతో ఇంటర్వ్యూలు కూడా చేశారు. ఈషా క్రియ అనే ఒక యోగ ముద్ర ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు అని చెప్పారు. సమంత వంటి ప్రముఖ సెలబ్రిటీలు కూడా ఈ ఈషా క్రియ చేస్తారు. ప్రతి శివరాత్రికి కోయంబత్తూర్ లో ఉన్న ఈషా ఫౌండేషన్ కి ఎంతో మంది వెళుతూ ఉంటారు. అక్కడ శివరాత్రి అంతా కూడా శివనామస్మరణతో మారు మ్రోగిపోతుంది. ఎంతో మంది ప్రముఖులు వచ్చి పాటలు పాడుతారు. ఇంకా ఎంతో మంది ప్రముఖులు వెళ్లి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. వారిలో నటీనటులతో పాటు, ఇంకా ఎంతో మంది గుర్తింపు పొందిన ప్రముఖులు ఉంటారు.

movie in which sadguru appeared

Ads

అయితే, సద్గురు తన బోధనల ద్వారా అందరికీ తెలుసు. కానీ సద్గురు ఒక సినిమాలో నటించారు అనే విషయం చాలా మందికి తెలియదు. అది కూడా ఒక హాలీవుడ్ సినిమాలో సద్గురు కనిపించారు. దిస్ ఈజ్ మీ నౌ అనే సినిమాలో సద్గురు నటించారు. ఫిబ్రవరి 16వ తేదీన ఈ సినిమా విడుదల అయ్యింది. అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా ఉంది. జెన్నిఫర్ లోపెజ్, బెన్ అఫ్లెక్ నటించిన ఈ సినిమాలో సద్గురు కూడా కొంచెం సేపు కనిపిస్తారు.

movie in which sadguru appeared

మరొక ప్రముఖ మోటివేటర్ అయిన జై శెట్టి కూడా ఒక పాత్రలో కనిపించారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా మంచి రివ్యూస్ అందుకుంటుంది. సాంకేతికంగా కూడా సినిమా చాలా బాగుంది అంటూ చూసిన వాళ్ళు అందరూ కూడా పొగుడుతున్నారు. మనిషి మెదడు, మనసుకి సంబంధించిన విషయాల గురించి ఈ సినిమాలో మాట్లాడతారు. సద్గురు సాధారణంగా ఇలాంటి విషయాల గురించి చెప్తూ ఉంటారు. అలా సద్గురు కూడా ఈ సినిమాలో నటించారు.

ALSO READ : గుర్తుపట్టలేనంతగా మారిపోయిన “లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్” హీరోయిన్..! ఇలా అయిపోయారేంటి..?

Previous articleసినిమాలో నటుల దుస్తులు మురికిగా కనిపించడానికి ఏం చేస్తారో తెలుసా.?
Next articleపరాయి స్త్రీ తో భర్తలు మోజులో పడడానికి.. 3 ముఖ్య కారణాలు ఇవే అంట.?