Ads
మహా శివరాత్రి వస్తోంది. ప్రపంచంలో ఉన్న భక్తులు అందరూ కూడా శివుడికి పూజలు చేస్తారు. దేవాలయాల్లో కూడా శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు, సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఎంతో మంది భక్తులు ఉపవాసాలు ఉంటారు. అయితే పూజల్లో కొన్ని పనులు చేయకూడదు.
అవి మనం తెలియక చేస్తాం. కానీ అలాంటి పనుల వల్ల దరిద్రం ఇంట్లోకి వస్తుంది. మనం చేసిన పనుల వల్ల మనకి తెలియకుండా మన ఇంట్లోకి దరిద్రం ప్రవేశిస్తుంది. అలా శివుడికి పూజ చేసేటప్పుడు కొన్ని పనులు చేయకూడదు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
# కొబ్బరినీళ్ళని తాంసిక ఆహారం అని అంటారు. ఇది శక్తిని తగ్గిస్తుంది. కానీ మహా శివరాత్రి నాడు శక్తి స్వరూపుడు అయిన శివుడితో ప్రజలు అనుసంధానం కలిగి ఉంటారు కాబట్టి, ఆ రోజు కొబ్బరినీళ్ళ వంటివి సమర్పించకూడదు.
# పరమశివుడు తపస్వి కాబట్టి ఆయన స్వభావానికి విరుద్ధమైన ఎరుపు రంగులో ఉన్న పూలు సమర్పించకూడదు. అందుకు బదులుగా తెల్లని పుష్పాలని సమర్పించాలి. కేతకి పూలు, కేవద పూలు కూడా సమర్పించకూడదు.
# పాలాభిషేకం చేసినప్పుడు ఆ పాలని కాంస్య పాత్రలో పోస్తే, చర్య జరిగి విషపూరితం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇలా చేయడం శివ పూజకు తగినది కాదు. అందుకే రాగి పాత్రలు వాడాలి.
Ads
# బిల్వపత్రాల మీద గీతలు కానీ, రంధ్రాలు కానీ లేకుండా చూసుకోవాలి. మంచిగా ఉన్న బిల్వపత్రాలని మాత్రమే శివుడికి సమర్పించాలి. శివుడు అనంతుడు, సర్వవ్యాపి. దేవుడిని ఒక రూపానికి పరిమితం చేయలేము కాబట్టి, శివలింగం చుట్టూ ప్రదక్షిణ చేయకుండా, అర్థ ప్రదక్షిణం మాత్రమే చేసి మళ్లీ ప్రారంభ స్థానానికి తిరిగి వచ్చేయాలి.
# సింధూరం, కుంకుమ వంటివి వాడకూడదు. సింధూరానికి విష్ణు భార్య అయిన లక్ష్మీదేవితో బంధం ఉంటుంది అని అంటారు. బంధాలకి అతీతుడు అని శివుడిని అంటారు కాబట్టి, కుంకుమ, సింధూరం వంటిది రాయకూడదు. అందుకు బదులుగా చందనం ఉపయోగించాలి.
ఇది మాత్రమే కాకుండా నలుపు రంగు దుస్తులు వేసుకోవడం కూడా తగ్గించాలి. శివరాత్రి రోజు నలుపు రంగు దుస్తులు వేసుకోవడం వల్ల ప్రతికూల శక్తులు ప్రభావం జరిపే అవకాశాలు ఉన్నాయి. అందుకే తెలుగు దుస్తులు కానీ, లేదా లేత రంగు దుస్తులను కానీ ఆ రోజు వేసుకోవాలి. శివరాత్రి రోజు పూజ చేసేటప్పుడు ఈ నియమాలు అని కూడా తప్పకుండా పాటించాలి.
ALSO READ : జాతకాలు కలిసినా మధ్యలోనే భార్యాభర్తలు ఎందుకు విడిపోతారు..?