ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు “సద్గురు” ఆస్తుల విలువ ఎంతో తెలుసా..? సంవత్సరానికి ఎంత సంపాదిస్తారు అంటే..?

Ads

ఆధ్యాత్మికత గురించి ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్తూ, మరొక పక్క ఒక మనిషి జీవన శైలి ఎలా ఉండాలి అనే విషయాల గురించి కూడా అవగాహన కల్పిస్తున్న వ్యక్తి జగ్గీ వాసుదేవ్. ఆయనని సద్గురు అని కూడా అంటారు.

అసలు సద్గురు అనే పేరుతోనే ఆయన చాలా మందికి సుపరిచితులు అయ్యారు. ప్రతి శివరాత్రికి కోయంబత్తూర్ లో తాను స్థాపించిన ఈషా ఫౌండేషన్ లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. శివరాత్రి జాగారం సందర్భంగా ఒక కార్యక్రమం నిర్వహించి, అందులో సద్గురు కూడా పాల్గొంటారు.

sadguru properties and earnings

ఈ కార్యక్రమంలో ఎంతో మంది ప్రముఖులు హాజరు అయ్యి శివనామస్మరణ చేస్తారు. ఆరోజు ఎంతో మంది సింగర్స్ కూడా శివుడి పాటలు ఆలపిస్తారు. అలా నిన్న జరిగిన శివరాత్రి వేడుకల్లో శంకర్ మహదేవన్ పాటలు ఆలపించారు. మరి కొంత మంది సింగర్స్ కూడా ఈ కార్యక్రమంలో పాటలని ఆలపించారు. పూజా హెగ్డే, తమన్నా వంటి ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని శివనామస్మరణ జపించారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా మాత్రమే కాకుండా, యూట్యూబ్ లో కూడా ప్రసారం చేస్తారు.

sadguru properties and earnings

అయితే, సద్గురు సంపాదన ఎంత అనే ఒక చర్చ అందరిలో నెలకొంది. ఈషా ఫౌండేషన్ కి ఎంతో మంది అభివృద్ధి కోసం తమకి చేతనైనంత మొత్తాన్ని అందజేశారు. ఈషా ఫౌండేషన్ లో సద్గురు ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇన్నర్ ఇంజనీరింగ్ పేరుతో ఎంతో మందికి మోటివేషన్ ఇస్తుంటారు. ఇందులో ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయి. యోగాకి సంబంధించిన కొన్ని కార్యక్రమాలు కూడా ఇందులో నిర్వహిస్తారు. వీటన్నిటికీ కూడా కొంత మొత్తాన్ని తీసుకుంటారు.

sadguru properties and earnings

Ads

అంతే కాకుండా దుస్తుల బ్రాండ్, ఇంటికి సంబంధించిన వస్తువులు, శరీర జాగ్రత్తల కోసం సంబంధించిన వస్తువులు, ఆహార పదార్థాలు, భక్తికి సంబంధించిన ఎన్నో సద్గురు అందజేస్తూ ఉంటారు. ఇది కూడా స్టోర్ ల రూపంలో అందుబాటులో ఉంటాయి. కాబట్టి వీటి ద్వారా కొంత మొత్తం వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. డొనేషన్ల రూపంలో కూడా కొంత మొత్తం వస్తూ ఉంటుంది. ఈషా ఫౌండేషన్ లో పనిచేసే చాలా మంది స్వచ్ఛందంగా వాలంటీర్లుగా పని చేస్తారు.

sadguru properties and earnings

2021 లో సద్గురు ఆస్తి 25 మిలియన్లు ఉన్నట్టు సమాచారం. ఇప్పుడు ఇంకా కొంతకాలంలో సద్గురు ఆస్తులు విలువ 50 నుండి 60 మిలియన్ల వరకు చేరుతుంది అని అంటున్నారు. ఆయనకి సోషల్ మీడియాలో కూడా చాలా మంది ఫాలోవర్లు ఉన్నారు. యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా సద్గురు నెలకి కొంత మొత్తాన్ని సంపాదిస్తూ ఉంటారు. నెలకి చాలా వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటారు. యూట్యూబ్ నుండి 1.8 వేల డాలర్ల నుండి 39.4 వేల డాలర్లు వస్తాయి.

sadguru properties and earnings

అంటే లక్ష నుండి 39 లక్షల వరకు వస్తాయి. ఇవి మాత్రమే కాకుండా, సద్గురుకి చాలా ఖరీదైన వస్తువులు కూడా ఉన్నాయి. సద్గురు దగ్గర రూ.2.19 కోట్ల విలువైన మెర్సిడెస్ బెంజ్ G63 క్లాస్, 20వేల డాలర్ల విలువైన టయోటా సియాన్ 1000 BHP, హమ్మర్ H2, ఫోర్డ్ ఎండీవర్ కార్లు ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా, ఒక జావా 42, ఒక బిఎండబ్ల్యూ కే 1600 జీటీ, టురిస్మో వెలోస్ 800, ఒక బీఎండబ్ల్యూ ఆర్ 1250 జీఎస్ బైకులు కూడా ఉన్నాయి.

ALSO READ : అంబానీ కోడలు వేసుకున్న ఈ లెహంగా స్పెషాలిటీ ఏంటో తెలుసా..? దాంతో తయారు చేశారా..?

Previous articleఈ 7 సెలబ్రిటీలు పెళ్ళికి ముందే పేరెంట్స్ అయ్యారు తెలుసా..?
Next articleసినిమాల్లోకి రాకముందే సామ్ ఓ యాడ్ చేసిందని మీకు తెలుసా..?
Mounikasingaluri is a Content Writer who Works at the Prathidvani Website. She has 2+ years of experience, and she has also worked at various Telugu news websites. She Publishes Latest Telugu Updates and Breaking News in Telugu, Movies Updates and Other Viral News.