Ads
OTT లు వచ్చిన తర్వాత ఇతర భాష చిత్రాల క్రేజ్ కూడా మన టాలీవుడ్ లో పెరిగింది.కంటెంట్ కొత్తగా ఉంటే ఏ భాషలో సినిమాని అయినా యాక్సెప్ట్ చేస్తున్నారు మన తెలుగు ఆడియన్స్.. అలాంటి సినిమా ఒకటి మలయాళం లో వచ్చి అద్భుతమైన హిట్ కొట్టింది.
జయరాంతోపాటు మమ్ముట్టి అతిథి పాత్రలో నటించిన మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా “అబ్రహం ఓజ్లర్” ఇప్పుడు OTT లోకి వచ్చింది. హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది ఈ సినిమా.ఈ సినిమాని మిథున్ మాన్యువల్ థామస్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో హీరోగా జయరాం నటించారు. సీరియల్ కి-ల్లర్ అలెక్స్ పాత్రలో మమ్ముట్టి నటించారు. జనవరి 11న ఈ సినిమాని థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేశారు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 40+ కోట్లను వసూలు సాధించి భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా బడ్జెట్ కేవలం 6 కోట్లు.
ఈ సినిమా కోసం చాలా రోజులుగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. డిస్నీ+హాట్ స్టార్ లో మార్చ్ 20 నుండి మలయాళం, తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ఇక కథ విషయానికి వస్తే అబ్రహం ఓజ్లర్ ( జయరాం ) కుటుంబ సభ్యులు మిస్ అవుతారు.మూడేళ్లు గడిచినా ఆచూకీ లభించలేదు. ఆ కేసు గురించి ఆలోచిస్తూ అబ్రహం సరిగా నిద్రపోడు.
Ads
మరోవైపు వరుసగా కొందరు భిన్న నేపథ్యాలు కలిగిన వ్యక్తులు హ-త్యలకు గురువుతుంటారు. ఒక హ-త్యకి మరొక హ-త్యకి సంబంధం లేకపోవడం, హ-త్య జరిగిన ప్లేస్ లో హ్యాపీ బర్త్డే అని రాసి పెట్టడం జరుగుతూ ఉంటుంది. అయితే వీటన్నింటినీ చూసిన అబ్రహం ఓజ్లర్ కేసుని ఛేదించి కుటుంబాన్ని కలుసుకుంటాడు. అయితే కి-డ్నాపర్ ఎవరు, ఎందుకు కి-డ్నాప్ చేసి చంపేవాడు అనేది ఈ సినిమా కధ.
అయితే ఈ సినిమా ఎలాంటి ప్రకటనలు లేకుండా సైలెంట్ గా ఓటీటిలోకి వచ్చేసింది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వేదికగా ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. మెడికల్ బ్యాక్ డ్రాప్ కథతో నడిచే ఈ థ్రిల్లర్ సినిమా స్టార్టింగ్ లో ఫామిలీ ఎమోషన్ సినిమా అన్నట్టుగా ఉంటుంది. ఫామిలీ వాళ్ళు మిస్ అయినప్పటినుండి కథ ఇంటరెస్టింగ్ గా మారుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాని చూడకపోతే చూసేయండి. ఎందుకంటే ఈ సినిమా చూసిన తర్వాత చాలా రోజుల తర్వాత ఒక మంచి థ్రిల్లర్ మూవీ చూసాం అనే ఫీలింగ్ కలుగుతుంది.
ALSO READ: OTT లో ట్రెండ్ అవుతున్న 5 రొమాంటిక్ వెబ్ సిరీస్ లు ఇవే