పుష్ప-2 కోసం అల్లు అర్జున్ ఇంత కఠినమైన డైట్ పాటిస్తున్నారా..? ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారు అంటే..?

Ads

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 సినిమా షూటింగ్ జరుగుతోంది. అల్లు అర్జున్ ఈ నెల 8వ తేదీ తన పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పుష్ప 2 టీజర్ విడుదల చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పోస్టర్ ఇవాళ విడుదల చేశారు. మొదటి భాగానికి కొనసాగింపుగానే ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ చాలా కష్టపడుతున్నారు. మొదటి పుష్ప సినిమాలో అల్లు అర్జున్ నటనకి నేషనల్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు ఈ సినిమాకి కూడా అలాగే అవార్డులు రావాలి అని ఉద్దేశంతోనే సినిమా బృందం కష్టపడి పనిచేస్తున్నారు. ఈసారి సినిమా అంతర్జాతీయ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవాలి అని ఆశిస్తున్నారు. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ ఒక కఠినమైన డైట్ పాటిస్తున్నారు. పుష్ప 1 సినిమాకి, పుష్ప 2 సినిమాకి రెండు వేరు వేరు డైట్ ప్లాన్స్ అల్లు అర్జున్ పాటిస్తున్నారు. మొదటి భాగానికి అల్లు అర్జున్ మాంసాహారం ఎక్కువగా తీసుకున్నారు.

Ads

కానీ ఇప్పుడు ఈ సినిమా కోసం అల్లు అర్జున్ మాంసాహారానికి దూరంగా ఉంటున్నారు. ఒక్కొక్క షెడ్యూల్ కి ఒక్కొక్క డైట్ మెయింటైన్ చేస్తున్నారు. ఇందుకోసం ఒక డైటీషియన్ ని కూడా నియమించుకున్నారు. కొన్ని సార్లు కేవలం వెజిటబుల్స్ మాత్రమే తీసుకుంటున్నారు. కొన్ని సార్లు లిక్విడ్ డైట్ ఫాలో అవుతున్నారు. పొద్దున పూట రాగి జావ, లేదా మిల్క్ షేక్ తో పాటు, స్నాక్స్, ఫ్రూట్స్, లేకపోతే నట్స్ తింటారు. మధ్యాహ్నం భోజనం కోసం రెండు పుల్కాలు, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ తింటారు.

ఒక్కొక్కసారి తినకుండానే షూటింగ్ చేస్తున్నారు. ఇందులో అల్లు అర్జున్ వివిధ వయసుల పాత్రల్లో కనిపిస్తారు అని సమాచారం. అందుకోసమే ఇలాంటి డైట్ ఫాలో అవుతున్నారు. గతంలో ఏ సినిమాకి కూడా అల్లు అర్జున్ ఇంతగా కష్టపడలేదు. కానీ అల్లు అర్జున్, ప్రతి సినిమాకి తన పాత్ర మార్పు కోసం ప్రత్యేకమైన డైట్ ఫాలో అవుతూ ఉంటారు. ఈ సినిమాకి కూడా అలాగే ఫాలో అవుతున్నారు. పుష్ప ఎన్నో భారీ అంచనాల మీద తెరకెక్కుతున్న సినిమా కాబట్టి ఇంకా ఎక్కువగా కష్టపడుతున్నారు.

ALSO READ : డీజే టిల్లుగా మహేష్ బాబు… అదరగొట్టేసారుగా..? ఈ వీడియో చూశారా..?

Previous articleభారదేశాన్ని పాలించిన రాజుల్లో బలమైన రాజు…స్వ‌ర్ణ‌యుగంగా మార్చిన గొప్ప రాజు ఇతనే..!
Next articleపెళ్లికి ముందు ఎన్టీఆర్‌కి ల‌క్ష్మీ ప్ర‌ణ‌తి పెట్టిన కండిష‌న్స్ ఏమిటో తెలుసా?