డీజే టిల్లుగా మహేష్ బాబు… అదరగొట్టేసారుగా..? ఈ వీడియో చూశారా..?

Ads

టెక్నాలజీ పెరిగిపోయింది. టెక్నాలజీ వాడకం కూడా పెరిగిపోయింది. టెక్నాలజీ లేకుండా రోజు గడవడం కూడా చాలా కష్టంగా ఉంది. టెక్నాలజీ వల్ల ఎన్నో పనులు సులువు అయ్యాయి. సమయం కూడా ఆదా అవుతుంది. టెక్నాలజీలో ఎన్నో రకాలు ఉంటాయి. సోషల్ మీడియా కూడా ఒక రకంగా చెప్పాలి అంటే టెక్నాలజీలో ఒక భాగమే ఏమో. ఎక్కడో ఉన్న వారిని, మరి ఎక్కడో ఉన్న వారితో కలుపుతుంది. కొన్ని సాధ్యం కాని విషయాలు కూడా టెక్నాలజీ వాడి, సోషల్ మీడియా ద్వారా అవి సాధ్యపడేలాగా చేస్తారు.

mahesh babu as dj tillu

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇటీవల బాగా చర్చల్లో నిలిచిన టాపిక్. ఏఐ టెక్నాలజీ అంటారు దీన్ని. ఇది ఉపయోగించి చాలా మంది సెలబ్రిటీల ముఖాలు మార్చి, ఇంకొకరికి వారి ముఖాలని పేస్ట్ చేసి సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు షేర్ చేస్తున్నారు. అందులో కొన్ని వివాదాత్మకమైన వీడియోలు కూడా ఉన్నాయి. కొన్ని మామూలు వీడియోలే ఉన్నాయి. ఇటీవల అలాంటి ఒక వీడియో గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. గతవారం విడుదల అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సినిమా టిల్లు స్క్వేర్.

mahesh babu as dj tillu

Ads

కలెక్షన్లతో ఈ సినిమా దూసుకుపోతోంది. అయితే ఈ సినిమాలో హీరో సిద్దు జొన్నలగడ్డ కాకుండా ఇంకెవరైనా ఉండి ఉంటే? ఊహించుకోవడానికి కూడా కష్టంగా ఉంది కదా? కానీ సోషల్ మీడియాలో రోస్టర్ బిడ్డ అనే ఒక పేజ్ ఈ విషయాన్ని సాధ్యం చేసి చూపించారు. టిల్లు పాత్రని మహేష్ బాబు చేస్తే ఎలా ఉంటుంది అనేది వీళ్ళు ఒక వీడియో ఎడిట్ చేసి షేర్ చేశారు.

tillu square trailer review

వీడియో ఎడిట్ చేయడం అంటే, కేవలం ముఖం మాత్రమే మార్చడం కాదు, గొంతు కూడా మార్చారు. టిల్లు పాత్ర మాట్లాడుతుంటే మహేష్ బాబు మాట్లాడుతున్నట్టే ఉంది. మహేష్ బాబు వాయిస్ తో ఈ డైలాగ్స్ వింటుంటే చాలా కొత్తగా అనిపిస్తుంది. అంతే కాకుండా అనుపమ పరమేశ్వరన్ పాత్రలో పూజా హెగ్డే పాత్రని, అన్నిటికంటే హై లైట్ అయిన హీరో తండ్రి పాత్రలో త్రివిక్రమ్ ముఖాన్ని యాడ్ చేశారు. దాంతో ఈ ఎడిట్ చేసిన వాళ్లని అందరూ మెచ్చుకుంటున్నారు.

watch video :

ALSO READ : Jr Ntr: ఎన్టీఆర్ ఇద్దరి పిల్లల స్కూల్ ఫీజు ఎంతో తెలుసా..? తెలిస్తే దిమ్మ తిరిగిపోతుందంతే!

Previous articleఈ హీరోయిన్ల పచ్చబొట్ల వెనుక ఇంత కథ ఉందా..?
Next articleNTR మొదలు సాయి ధరమ్ తేజ్ దాకా.. ఈ 21 హీరోలు ఏం చదువుకున్నారో తెలుసా..?