Ads
టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కలియుగపాండవులు సినిమాతో 1986 లో సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. వెంకటేష్ తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించారు. ఆయనకున్న లేడీ ఫాలోయింగ్ గురించి వేరే చెప్పనక్కర్లేదు.
ఫ్యామిలీ స్టోరీ నేపద్యంలో సాగే సినిమాలలో ఉండే సెంటిమెంట్ సీన్స్ లో నటించాలంటే విక్టరీ వెంకటేష్ తరువాతే ఎవరైనా అనేంతగా నటిస్తారు. ఇక హీరోలందరిలోను వెంకటేష్ చాలా భిన్నంగా ఉంటారు. ఆయనని చూస్తే హీరోలు ఇలా కూడా ఉంటారా అనిపిస్తుంది. ఇండస్ట్రీలో రూమర్స్ సర్వసాధారణం. అందరి పైన ఎప్పుడో ఒకసారైన ఏదో ఒక రూమర్ వచ్చే ఉంటుంది. కానీ ఎలాంటి రూమర్స్ లేని హీరో వెంకటేష్ మాత్రమే. అంత గొప్ప వ్యక్తిత్వం కలిగిన హీరో వెంకటేష్. దాదాపుగా హీరోల భార్యలు,కుటుంబ సభ్యులు సామాజిక మధ్యమాల్లో యాక్టివ్ గా ఉంటారు.
Ads
అయితే వెంకటేష్ భార్య మరియు పిల్లలు ఇప్పటివరకు ఎప్పుడూ సోషల్ మీడియాలో ఉన్నట్టు కనిపించలేదు. వెంకటేష్ ఫ్యామిలీ అంతా మొదటి నుండి మీడియా కి, సోషల్ మీడియా కి కూడా దూరంగానే ఉంటారు.వెంకటేష్ ఎప్పుడు భార్య, పిల్లల గురించి చెప్పిన సందర్భాలు లేవు. అలాగే భార్యతో కలిసి బయట కనిపించింది లేదు. వెంకటేష్ సతీమణి పేరు నీరజారెడ్డి. ఆమె ఆంధ్రప్రదేశ్ లోని మదనపల్లిలో జన్మించారు. నీరజారెడ్డి తండ్రి పేరు సుబ్బారెడ్డి. ఆయన పెద్ద బిజినెస్ మెన్. ఆయనకు సినిమా థియేటర్లు ఉన్నాయి.రామానాయుడుగారు వెంకటేష్ కోసం పెళ్లి సంబంధాలు వెతుకుతున్న క్రమంలో నాగిరెడ్డి గారు ఒక సంబంధం గురించి చెప్పారంట, కానీ మీ కులం అమ్మాయి కాదని చెప్పాడట. దానికి రామానాయుడు మంచి అమ్మాయి కావాలి. కులం పట్టింపు మాకు లేదు అని చెప్పారంట. నీరజారెడ్డి రామానాయుడు, వెంకటేష్ లకి నచ్చడంతో వారిద్దరికీ 1987లో పెళ్లి గ్రాండ్ గా జరిపించారు. అయితే నీరజారెడ్డికి మీడియా ముందుకు రావడానికి ఇష్టం పడదంట, అందుకే ఆమె సినిమా ఫంక్షన్స్ కి గాని, షూటింగ్స్ కానీ రాలేదట.
Also Read: ‘యమదొంగ’ సినిమాలో సత్యనారాయణ యముడుగా నటించకపోవడానికి కారణం ఇదేనా?