“సాయి ధరమ్ తేజ్” లాగానే… తన తల్లి పేరుని తన పేరుతో కలుపుకున్న ఈ తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..?

Ads

ఇటీవల ప్రముఖ హీరో సాయి ధరమ్ తేజ్ తన పేరు మార్చుకున్న సంగతి తెలిసిందే. సాయి ధరమ్ తేజ్ తల్లి పేరు అయిన దుర్గ అనే పేరుని సాయి ధరమ్ తేజ్ తన పేరులో కలుపుకొని సాయి దుర్గా తేజ్ అని తన పేరు మార్చుకున్నారు. దుర్గా ప్రొడక్షన్స్ పేరుతో ఒక ప్రొడక్షన్ హౌస్ కూడా నెలకొల్పారు. ఇది ఇటీవల ప్రకటించారు. సాయి ధరమ్ తేజ్ తన తల్లి మీద అభిమానంతో ఇలా చేశారు.

heroine who added her mother name to her name

సాయి ధరమ్ తేజ్ సాధారణంగా తన తల్లి గురించి చాలా సార్లు చెప్తారు. సాయి ధరమ్ తేజ్ మాటలు చూస్తుంటేనే దుర్గ గారు అంటే సాయి ధరమ్ తేజ్ కి ఎంత ఇష్టం అనేది అర్థం అవుతోంది. సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియా అకౌంట్స్ లో కూడా తల్లితో కలిసి ఉన్న ఫోటోలు షేర్ చేస్తూ ఉంటారు. అయితే, సాయి ధరమ్ తేజ్ కంటే ముందే ఒక హీరోయిన్ తన పేరులో తన తల్లి పేరుని కలుపుకున్నారు. ఆ హీరోయిన్ కూడా మన అందరికీ చాలా బాగా తెలుసు.

heroine who added her mother name to her name

Ads

ఎన్నో తెలుగు సినిమాల్లో నటించారు. శ్రద్ధ శ్రీనాథ్ పేరుతో మనందరికీ తెలిసిన ఈ హీరోయిన్, తన తల్లి పేరుని తన పేరులో చేర్చుకొని శ్రద్ధ రమా శ్రీనాథ్ అని సోషల్ మీడియా అకౌంట్స్ లో పెట్టుకున్నారు. సాధారణంగా ఈ పేరు చూసిన వాళ్ళందరూ కూడా శ్రద్ధ పేరు శ్రద్ధ రమా శ్రీనాథ్ అని అనుకున్నారు. కానీ తర్వాత చూస్తే శ్రద్ధ తల్లి పేరు రమా శ్రీనాథ్ అని ఉంది. అంటే శ్రద్ధ తన తల్లి పేరుని తన పేరులో కలుపుకున్నారు. చాలా సంవత్సరాల నుండి శ్రద్ధ సోషల్ మీడియా అకౌంట్స్ లో తన పేరు ఇలాగే ఉంటుంది.

heroine who added her mother name to her name

నాని హీరోగా నటించిన జెర్సీ సినిమాతో శ్రద్ధ తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. మొదటి సినిమాతోనే చాలా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. తర్వాత సిద్దు జొన్నలగడ్డతో కృష్ణ అండ్ హిజ్ లీల, విక్టరీ వెంకటేష్ తో సైంధవ్ సినిమాలో నటించారు. సంక్రాంతి కానుకగా సైంధవ్ సినిమా విడుదల అయ్యింది. ఈ సినిమాలో తన పాత్రకి తనే డబ్బింగ్ కూడా చెప్పుకున్నారు. ప్రస్తుతం కన్నడ, తమిళ, మలయాళం, తెలుగు సినిమాలతో శ్రద్ధ చాలా బిజీగా ఉన్నారు. అలాగే కొన్ని హిందీ సినిమాల్లో కూడా శ్రద్ధ శ్రీనాథ్ నటించారు. ఇప్పుడు తెలుగు సినిమాల్లో కూడా నటిస్తున్నారు.

ALSO READ : చిరంజీవి పక్కనే నిలబడ్డ ఈ అబ్బాయి ఇప్పుడు ఇండస్ట్రీలోనే టాప్ హీరో అయ్యాడు..! ఎవరో తెలుసా..?

Previous articleజీడిపప్పు ని తీసుకుంటే.. ఈ 6 సమస్యలకి దూరంగా ఉండచ్చు..!
Next articleవెంకటేష్ తన భార్యని బయటికి ఎక్కువగా ఎందుకు తీసుకురారు..? వీరి పెళ్లి వెనుక ఉన్న కథ ఏంటో తెలుసా..?