Ads
పెళ్లి అనేది యువతీ యువకుల జీవితాలలో అతి ముఖ్యమైన ఘట్టం. పెళ్ళికి ముందు జీవితం, పెళ్లి తరువాత జీవితం అనే విధంగా ఉంటుంది పెళ్లి.ఈ పెళ్లి జీవితంలో ఎన్నో శారీరక, మానసిక మార్పులని తీసుకువస్తుంది. అందులో ఒకటి శరీర బరువు పెరగటం. సాధారణంగా పెళ్లి తర్వాత అమ్మాయిలు బరువు పెరుగుతారు అనేది నిజం. అయితే మరొక నిజం ఏమిటంటే అమ్మాయిలే కాదు పెళ్లి తర్వాత అబ్బాయిలు కూడా బరువు పెరుగుతారు.
పెళ్లి పీటల మీద స్లిమ్ గా ఉన్న పెళ్ళికొడుకు సంవత్సరం తర్వాత బాన పొట్టతో కనిపిస్తాడు. అయితే వివాహానికి బరువు పెరగటానికి సంబంధం ఏమిటి అనే అనుమానం మీలో రావచ్చు. అయితే చాలా పరిశోధనలు ఈ రెండింటికి మధ్య సంబంధం ఉంది అనే విషయాన్ని వెల్లడించాయి.
Ads
డైలీ మెయిల్ నివేదిక ప్రకారం చైనాలో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం వివాహం తర్వాత పురుషులు లావుగా, సోమరిగా తయారవుతారు. పెళ్లయిన ఐదు సంవత్సరాల నుంచి బరువు పెరగటం ప్రారంభిస్తారు. ఎందుకంటే ఆ సమయంలో వారు ఎక్కువ ఆహారాన్ని తీసుకుంటూ తక్కువ వ్యాయామాన్ని చేస్తారు. ఎకనామిక్స్ అండ్ హ్యూమన్ బయాలజీలో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం వివాహం తర్వాత మొదటి ఐదేళ్లలో పురుషుల బిఎంఐ పెరుగుతూనే ఉంటుంది. ఆ తర్వాత వారి బరువు స్థిరంగా ఉంటుంది.
అంతేకాదు ఒక వ్యక్తి తమ సన్నిహిత సంబంధంతో ఎంత సంతృప్తిగా ఉంటారో వారు అంత స్థూలకాయలుగా మారే అవకాశం ఉంటుంది. వివాహం తర్వాత 5.2 శాతం మంది పురుషులు అధిక బరువుని కలిగి ఉంటారు, ఊబకాయం రేటు 2.5% పెరుగుతుంది. కాబట్టి వివాహం తరువాత ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను కొనసాగించడం చాలా ముఖ్యం. పెళ్లి అయిన తర్వాత కూడా పురుషులు శరీర బరువు పెరగకుండా క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం చాలా అవసరం. ఈ పరిశోధనలో తేలిన మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పెళ్లి తర్వాత బరువు పెరగడంలో స్త్రీల కన్నా పురుషులే ముందున్నట్లు అధ్యయనాలు పేర్కొంటున్నాయి.