“చైనా” వాళ్ళు క్రికెట్ ఎందుకు ఆడరో తెలుసా.? వెనకున్న కారణాలు ఇవే.!

Ads

ప్రపంచం మొత్తంలో ఎక్కువ క్రేజ్ ఉండేది రెండింటికి మాత్రమే. ఒకటి సినిమాలు అయితే ఇంకొకటి క్రికెట్. రెండిట్లో దేనికి ఎక్కువ మంది అభిమానులు ఉన్నారో చెప్పడం చాలా కష్టం ఏమో. ఎంటర్టైన్మెంట్ లో రెండిటికీ అంత పోటీ ఉంటుంది మరి. ఇంక క్రికెట్ గురించి అయితే వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఒకరోజు ఏదైనా మ్యాచ్ ఉంది ఉంటే ప్రపంచంలో ఉన్న క్రికెట్ అభిమానులు అందరూ మ్యాచ్ మొదలయ్యే ముందు రోజు నుండే ఎవరు గెలుస్తారు అనే టెన్షన్ లో ఉంటారు.

అయితే మీరు ఒక విషయం గమనించారా? క్రికెట్ లో అన్ని దేశాల జట్లు పాల్గొంటాయి. కానీ చైనా నుండి మాత్రం క్రికెట్ జట్టు పాల్గొన్నట్టు ఎప్పుడు చూసి ఉండరు. అందుకు కారణం కూడా ఉంది. అదేంటంటే. సాధారణంగా ఒలంపిక్స్ లాంటి గ్లోబల్ స్పోర్ట్స్ లో చైనా ఎప్పుడూ ముందు స్థానంలో ఉంటుంది. ఒలంపిక్స్ లో ఎంతో మంది చైనా ప్లేయర్లు ఎన్నో మెడల్స్ సాధించారు.

Ads

కానీ ఒలింపిక్స్ లో క్రికెట్ ఒక భాగం కాదు. అందుకే చైనా క్రికెట్ వైపు ఎక్కువగా దృష్టి పెట్టలేదు. ఇది మాత్రమే కాదు. చైనా క్రికెట్ ఆడకపోవడానికి ఇంకొక కారణం కూడా ఉంది. అదేంటంటే. చైనా ఎప్పుడూ బ్రిటిష్ పాలనలో లేదు. క్రికెట్ ఆడుతున్న దేశాలు ఎప్పుడో ఒక సమయంలో బ్రిటిష్ పాలనలో ఉన్నాయి.

చైనాలో బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ ఎక్కువగా ఆడతారు. ఈ రెండు ఆటలు ఒలంపిక్స్ లోకి పరిగణిస్తారు. క్రికెట్ అనేది గ్లోబల్ స్పోర్ట్ కిందకి రాదు. ప్రపంచంలో ఉన్న కొన్ని దేశాలు మాత్రమే ఈ క్రికెట్ అనే ఆటలో పాల్గొంటాయి. చైనా క్రికెట్ ఆడకపోవడానికి ఇది కూడా ఒక కారణమని అనచ్చు.

అయితే, చైనాకి కూడా ఒక క్రికెట్ టీం ఉంది. 2009 సంవత్సరంలో ఏసీసీ ట్రోఫీ ఛాలెంజ్ లో ఈ క్రికెట్ జట్టు పాల్గొంది. కానీ మొదట మ్యాచ్ లలో ఓడిపోయింది. తర్వాత మయన్మార్ తో జరిగిన మ్యాచ్ లో మొదటి ఇంటర్నేషనల్ విజయం కూడా నమోదు చేసుకుంది. అంతే కాకుండా ఐసిసి చైనాలో కూడా క్రికెట్ ని ప్రమోట్ చేస్తున్నారు. 2019 లో జరిగిన టి 20 ఉమెన్స్ ఈస్ట్ ఏషియా కప్ టోర్నమెంట్ లో చైనా ఉమెన్ టీం కూడా పాల్గొని విజయం సాధించింది. చైనా క్రికెట్ ఆడకపోవడానికి కారణాలు ఇవే .

Previous article26 ఏళ్లకి మొదటి సినిమా… ఎంతోమంది హీరోలు కూడా ఈయనకి అభిమానులు..! ఎవరో తెలుసా..?
Next articleరాత్రి సమయంలో చపాతీ తింటే మంచిదా? భోజనం తింటే మంచిదా? ఈ విషయంలో వైద్యులు ఏమంటున్నారంటే?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.