Ads
ఒక సినిమా రిలీజ్ అయిన ఏడాదిలోపు డిజిటల్ రిలీజ్ అవుతుంది. సాధారణంగా అయితే నెల తర్వాత అవుతుంది. లేట్ అయితే ఏడాదిలోపు అవుతుంది. కానీ ఈ సినిమా మాత్రం విడుదల అయిన 23 సంవత్సరాలు తర్వాత అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చింది. ఈ సినిమా పేరు ఆళవందాన్. ఇదే సినిమాని తెలుగులో అభయ్ పేరుతో విడుదల చేశారు. నవంబర్ 16 వ తేదీ, 2001 లో ఈ సినిమా విడుదల అయ్యింది. కమల్ హాసన్ హీరోగా నటించిన ఈ సినిమాలో, రవీనా టాండన్, మనీషా కొయిరాలా హీరోయిన్లుగా నటించారు. సురేష్ కృష్ణ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.
శంకర్-ఎహసాన్-లాయ్ ఈ సినిమాకి అందించారు. కమల్ హాసన్ రాసిన దాయం అనే నవల ఆధారంగా ఈ సినిమా తీశారు. ఈ సినిమాలో కమల్ హాసన్ మేజర్ విజయ్ కుమార్, నంద, అలియాస్ నందు, అలియాస్ అభయ్ కుమార్ అనే రెండు పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో కమల్ హాసన్ నటనకి తగిన గుర్తింపు రాలేదు అని ఇప్పటికీ అంటుంటారు. ఇటీవల దర్శకుడు సురేష్ కృష్ణ కూడా ఈ సినిమాలో కమల్ హాసన్ కష్టానికి గుర్తింపు దొరికితే బాగుంటుంది అని అన్నారు.
Ads
ఈ సినిమా నిర్మాతకి, కమల్ హాసన్ కి గొడవలు ఉన్నాయి అని చెప్తూ ఉంటారు. అందుకే సినిమా విడుదల అయ్యి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఓటీటీలోకి రాలేదు. ఇప్పుడు 23 సంవత్సరాలు తర్వాత ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది. సినిమాకి విమర్శకుల ప్రశంసలు వచ్చాయి. ముఖ్యంగా కమల్ హాసన్ పోషించిన పాత్రని అందరూ పొగిడారు. కమల్ హాసన్ ప్రతి సినిమాకి చాలా కష్టపడతారు. తనని తాను మార్చుకుంటారు. సినిమాలో కమల్ హాసన్ కనిపించరు. కేవలం కమల్ హాసన్ పోషించిన పాత్రలు మాత్రమే కనిపిస్తాయి. అందుకే కమల్ హాసన్ ని లోక నాయకుడు అని అంటారు.
కమల్ హాసన్ పోషించిన గొప్ప పాత్రల్లో అభయ్ పాత్ర కూడా ఒకటి. ఈ పాత్ర కోసం కమల్ హాసన్ తన జుట్టు తీయించుకున్నారు. 10 కిలోల బరువు కూడా పెరిగారు. ఒక పాత్ర కోసం ఇంత కష్టపడడం అంటే చిన్న విషయం కాదు. ఇదే సినిమాలో మేజర్ పాత్ర కూడా పోషించారు. ఈ పాత్ర కోసం కమల్ హాసన్ నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ఒక క్రాష్ కోర్స్ చేశారు. అలాగే సినిమాలో నటించిన మేజర్ రవిని కూడా అడిగి సలహాలు తీసుకున్నారు. ఈ సినిమా చూసిన వాళ్ళందరూ కూడా కమల్ హాసన్ నటనని అభినందిస్తూ కామెంట్స్ చేశారు.