విడాకులు తీసుకున్న మహిళ ఇన్ని సమస్యలు ఎదుర్కొంటుందా..? ఆకాశం నీ హద్దురా హీరోయిన్ నటించిన ఈ సినిమా చూశారా..?

Ads

ఆకాశం నీ హద్దురా సినిమా ద్వారా తెలుగులో కూడా గుర్తింపు పొందిన నటి అపర్ణ బాలమురళి. అపర్ణ మలయాళం నటి. మలయాళం సినిమాల్లో మంచి నటిగా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత తమిళ్ సినిమాల్లో కూడా నటించ సాగారు. అపర్ణ నటించిన సినిమా సుందరి గార్డెన్స్ డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ అయ్యింది. సోనీ లివ్ లో ఈ సినిమా స్ట్రీమ్ అవుతోంది. 2022 లో వచ్చిన ఈ సినిమా మంచి ప్రశంసలు అందుకుంది. చార్లీ డేవిస్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఆల్ఫోన్స్ జోసెఫ్ ఈ సినిమాకి సంగీతం అందించారు.

aparna balamurali movie

మలయాళంతో పాటు, తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉంది. సుందరి సారా మాథ్యూస్ (అపర్ణ బాలమురళి) అనే ఒక మహిళ చుట్టూ ఈ సినిమా నడుస్తుంది. సినిమా చాలా బాగా రాసుకున్నారు. అంతే బాగా తెర మీద చూపించారు. ఇలాంటి సినిమాల్లో పర్ఫార్మెన్స్ ఎంత బాగుంటే సినిమా అంత బాగుంటుంది. ఈ సినిమాలో నటించిన వాళ్లందరూ కూడా చాలా బాగా నటించారు. నీరజ్ మాధవ్ హీరోగా నటించారు. అపర్ణ బాలమురళి నటన ఈ సినిమాకి హైలైట్ గా నిలిచింది. 40 సంవత్సరాలు దాటి, విడాకులు తీసుకున్న ఒక మహిళ జీవితం ఎలా ఉంటుంది అనేది ఈ సినిమాలో చూపించారు.

Ads

చాలా సెన్సిటివ్ విషయం మీద ఈ సినిమా నడుస్తుంది. అంతే సెన్సిటివ్ గా ఈ విషయాన్ని చూపించారు. ఎమోషన్స్ చాలా బాగుంటాయి. కామెడీ కూడా నవ్వు తెప్పించే విధంగా ఉంటుంది. లొకేషన్స్ కూడా సహజమైన లొకేషన్స్ లోనే చిత్రీకరించారు. సినిమా నిడివి కూడా రెండు గంటల లోపే ఉంటుంది. కాబట్టి సాగదీసినట్టు కూడా ఎక్కువగా అనిపించదు. ఒకటే విషయం మీద సినిమా నడుస్తుంది. ఒక అమ్మాయి జీవితంలో ఎలాంటి సంఘటనలు జరుగుతాయి అనేది ఈ సినిమాలో చూపించారు.

ఆ అమ్మాయి ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది అనేది కూడా ఇందులో చూపించారు. డబ్బింగ్ విషయంలో ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది. కొంత మందికి డబ్బింగ్ లో ఇచ్చిన వాయిస్ లు సూట్ అయినట్టు అనిపించవు. కానీ ఒరిజినల్ లో చూస్తే మాత్రం సినిమా ఎమోషన్ ప్రేక్షకుల అర్థం చేసుకుంటారు. డబ్బింగ్ లో కూడా డైలాగ్స్ బాగా రాసుకున్నారు. అంతే బాగా తెర మీద చూపించారు.

Previous article30 ఏళ్లు దాటినా కూడా అబ్బాయిలు పెళ్లి వద్దు అనడానికి కారణాలు ఏంటో తెలుసా..?
Next articleఈ ఫోటోలో ఉన్న అబ్బాయి.. పాన్ ఇండియా రేంజ్ కి ఎదిగిన తెలుగు హీరో.. ఎవరో గుర్తుపట్టారా..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.