Ads
భారతీయ వివాహ వ్యవస్థ ఎంతో ఔన్నత్యమైనది. అలాగే పెళ్లి అనేది జీవితంలో ఓ ముఖ్యమైన, అనిర్వచనీయమైన ఘట్టం. వివాహం అనే మధురమైన ఘట్టం ప్రతి ఒక్క జంటకూ ఎంతో ప్రత్యేకం. ఈ బంధం ఇద్దరు మనుషుల మధ్య నిబద్ధత, ఇది వారిని జీవితాంతం ఒకరికొకరు అనుబంధంగా ఉంచుతుంది. ప్రతి సుఖం, దుఃఖంలో కలిసి నిలబడటానికి హామీ ఇస్తుంది.
అయితే వివాహమైన తరువాత ప్రతి ఒక్కరి జీవితంలో మార్పులు కచ్చితం. ఎందుకంటే ఏ ఇద్దరు వ్యక్తుల అభిప్రాయాలు, అభిరుచులు, అలవాట్లు అనేవి ఒకే విధంగా ఉండవు. అందుకే అమ్మాయిలతో పాటు.. అబ్బాయిలు కూడా పెళ్లి తర్వాత వారి జీవితం ఎలాఉంటుందో అని ఆందోళన పడుతూ ఉంటారు.
అయితే అనుకోని పరిస్థితుల్లో పెళ్లి జరిగిన ఒక యువకుడి కథని ఇప్పుడు చూద్దాం… ” జీవితం ఎప్పుడు ఎలాంటి మలుపులు తిరుగుతుందో ఎవరికీ తెలీదు. మనం కోరుకున్నవన్నీ మనకు దక్కాలని లేదు. అలాగే మనం కోరుకొని కొన్ని వరాలను కూడా జీవితం మనకు అందిస్తుంది.” అంటూ తన జీవితం లో జరిగిన ఓ సంఘటన గురించి చెప్పుకొచ్చాడు ఓ యువకుడు.
” అమ్మ, నాన్న, అన్నయ్య, నేను ఇదే మా కుటుంబం. చిన్నప్పటి నుంచి అందరూ అన్నయ్యని ఎక్కువ గారం గా చూసేవాళ్ళు ఎందుకో నాకు తెలిసేది కాదు. కానీ నాకు అన్నయ్య అంటే ఎంతో ఇష్టం. వాడు నాకు ఎప్పుడు తోడుగా ఉండేవాడు. నేను ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం లో చేరాను. ఓ రోజు మా అన్నయ్య కోసం ఒక సంబంధం వచ్చింది. ఆమె ఒక సాఫ్ట్ వెర్ ఉద్యోగి. ఒకరోజు వాళ్ళు పెళ్లి చూపులకు మా ఇంటికి వచ్చారు. అన్ని మాట్లాడుకొని సంబంధం కుదుర్చుకొని వెళ్లారు. కానీ నాకు ఆ రోజు ముఖ్యమైన మీటింగ్ ఉండటంతో నేను ఆఫీస్ కి వెళ్ళిపోయాను.
Ads
తర్వాత అన్నయ్య పెళ్ళికి ఒక నెలరోజుల్లో ముహూర్తం పెట్టారు. అప్పటి నుంచి మా ఇంట్లో పెళ్లి హడావిడి మొదలైంది. బంధువుల రాక కూడా ప్రారంభమైంది. మా నాన్న తన దగ్గర ఉన్న డబ్బుతో పాటు పెళ్లి చేసేందుకు కొంత డబ్బును అప్పు చేసి మరీ పెళ్లి పనులు మొదలెట్టారు. షాపింగ్ పనులు కూడా పూర్తయ్యాయి. అయితే ఒకరోజు బయటకు వెళ్లిన అన్నయ్యకి ఆక్సిడెంట్ అయ్యింది. అప్పటికి పెళ్లికి ఇంకా కేవలం వారం రోజులు మాత్రమే గడువుంది. ఆక్సిడెంట్ తో అన్నయ్య పరిస్థితి విషమంగా మారింది. ఇక కొద్దీ రోజులే బ్రతుకుతాడు అని తేల్చేసారు డాక్టర్లు.
అన్నయ్యని ఇంటికి తీసుకొచ్చాక పెళ్లి కూతురు వారికి ఫోన్ చేసి.. వాళ్లను పిలిపించి వారికి జరిగిందంతా చెప్పేశారు. అప్పుడు నేను ఆఫీస్ కి వెళ్లాను. సాయంత్రం నేను ఆఫీసు నుండి ఇంటికొచ్చేసరికి అంతా సంతోషంగా ఉన్నారు. దానికి కారణం ఎంత అని ఆలోచిస్తుండగా అన్నయ్య విషయం చెప్పాడు. అన్నయ్యకి బదులు నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అన్నయ్య నన్ను కోరాడు. అదే తన చివరి కోరిక అని చెప్పాడు. దీంతో నాకు ఒప్పుకోక తప్పలేదు. అలా అనుకోకుండా నా పెళ్లి జరిగిపోయింది.
అసలు ఆ అమ్మాయి గురించి కూడా నాకు సరిగ్గా తెలీదు. తర్వాత మెం ఇద్దరం ఒంటరిగా ఉన్నపుడు ఆమె మాట్లాడిన మాటలు నేను ఇప్పటికీ మర్చిపోలేను. మనిద్దరికీ ఒకరి గురించి ఒకరికి ఏం తెలీదు. ముందు ఫ్రెండ్స్ లా ఉండి.. తర్వాత మన జీవితాన్ని ప్రారంభిద్దాం అని చెప్పింది. మనిద్దరికీ ఏ ఇబ్బంది ఉండదు అని తను చెబుతుంటే అది కలా..?నిజమా అస్సలేమీ అర్థం కాలేదు. నన్ను ప్రేమించే వారు కూడా ఉంటారా’ అని నేను అస్సలు ఊహించలేదు. అలా నాకు నా పెళ్లి తర్వాత ప్రేమను పంచిన భాగస్వామి దొరికింది. అప్పుడే నాకు అర్థమైంది ప్రేమ అనేది కేవలం.. పెళ్లికి ముందే ఉండాలని రూలేం లేదు. పెళ్లి జరిగిన తర్వాత కూడా ప్రేమించుకోవచ్చు అని. అందుకు నా జీవితమే ఉదాహరణ.” అంటూ చెప్పుకొచ్చాడు ఆ యువకుడు.