Ads
తెలుగు సిని పరిశ్రమలో యాక్షన్, ప్రేమ,క్రైమ్, థ్రిల్లర్ రకరకాలా స్టోరీస్ తో చాలా సినిమాలు తెరకెక్కాయి. ఇక సినిమాకు స్టోరీ ఎంత అవసరమో, ఆ సినిమాకు టైటిల్ కు అంతే ప్రాధాన్యం ఉంటుంది. ఆ విషయం అందరికి తెలిసిందే.
దర్శకనిర్మాతలు మూవీకి టైటిల్ ను డిసైడ్ చేయడం ఎంత కష్టమైన పనో వారికే తెలుసు. ఇక టైటిల్ విషయంలో మేకర్స్ వెనుకడుగు వేయరు. అయితే మేకర్స్ వారి సినిమా కథకు తగ్గట్టుగా ఉండే టైటిల్ ను పెట్టేందుకు పాత చిత్రాల టైటిల్స్ ను పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఒకే టైటిల్ తో రెండు, మూడు సినిమాలు ఉన్నాయన్న మాట. అలా ఒకే టైటిల్ తో వచ్చిన రెండు సినిమాల గురించి తెలుసుకుందాం.మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన సినిమా ఖైదీ.చిరంజీవి కెరీర్ ను మలుపు తిప్పిన మూవీగా చెప్పచ్చు. ఇక ఖైదీ అనే టైటిల్ తోనే తమిళ నటుడు కార్తీ హీరోగా సినిమా తెలుగులో విడుదల అయ్యింది. చిరంజీవి హీరోగా 1986లో విడుదలైన సినిమా రాక్షసుడు. ఇదే టైటిల్ తో తమిళ హీరో సూర్య కూడా తెలుగు ఆడియెన్స్ ముందుకు వచ్చారు.అక్కినేని నాగేశ్వరరావు నటించిన దేవదాసు మూవీ 1953 సంవత్సరంలో విడుదలై విజయం సాదించింది. అయితే 2016లో దేవదాసు టైటిల్ తో రామ్ పోతినేని హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత ఇదే టైటిల్ తో అక్కినేని నాగార్జున, నాచురల్ స్టార్ నాని నటించిన మూవీ రిలీజ్ అయ్యింది.
Ads
గతంలో అక్కినేని నాగేశ్వరరావు హీరోగా వచ్చిన మూవీ శ్రీమంతుడు. మహేష్ బాబు శ్రీమంతుడు అనే అదే టైటిల్ తో మూవీ వచ్చిన సంగతి తెలిసిందే. వెంకటేష్, నితిన్ కూడా శ్రీనివాస కళ్యాణం అనే సేమ్ టైటిల్ తో సినిమాలు వచ్చాయి. మహర్షి టైటిల్ తో విడుదలయిన రెండు చిత్రాలు హిట్ అయ్యాయి.తొలిప్రేమ టైటిల్ తో పవన్ కళ్యాణ్,వరుణ్ తేజ్ సినిమాలు వచ్చాయి. గణేష్ అనే టైటిల్ తో వెంకటేష్, రామ్ సినిమాలు వచ్చాయి. ఇక బాలకృష్ణ, కార్తీ సుల్తాన్ అనే టైటిల్ తో వచ్చారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖుషి మూవీ అందుకున్న విజయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం అదే టైటిల్ తో విజయదేవరకొండ, సమంత కూడా ఒక మూవీ చేస్తున్నారు.
Also Read: రజనీకాంత్ శివాజీ సినిమాలోని అక్కమ్మ, జక్కమ్మలు బయట ఎలా ఉంటారో తెలుసా?