అన్ స్టాపబుల్ షోలో పవన్ కళ్యాణ్ ధరించిన హుడీ ధర ఎంతో తెలుసా?

Ads

నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కార్యక్రమానికి ఎంత ఆదరణ ఉందో అందరికి తెలిసిందే. అయితే తాజాగా ఈ షోలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఇక ఈ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ పూర్తి చేసుకుంది.

Ads

ఈ ఎపిసోడ్ త్వరలో తెలుగు ఓటీటీ ఆహాలో ప్రసారం అవనుంది. ఈ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ గురించి అల్లు అరవింద్ మీడియాతో కూడా మాట్లాడారు. పవర్ స్టార్ లాంటి పెద్ద స్టార్ ఈ షోకి రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.ఇక ఈ షోకు పవన్ కళ్యాణ్ వచ్చిన సమయంలో షో నిర్వాహకులు చాలా హంగామా చేశారు. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ అలాంటిది మరి.
ఇక పవన్ పాల్గొనే ఈ ఎపిసోడ్ కి చిత్రీకరణ కూడా పూర్తయింది. ఇప్పటికే పవన్ ఎపిసోడ్ పై అంచనాలు పెరిగిపోయాయి. బాలకృష్ణ ఈ ఎపిసోడ్ లో పవర్ స్టార్ ను ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు. మరి వాటికి పవన్ కళ్యాణ్ ఇచ్చే సమాధానాలు ఏమిటి అనే వాటిపై అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. ఇక ఈ ఎపిసోడ్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో షికారు చేస్తున్నాయి. వాటిలో పవర్ స్టార్ బ్లాక్ కలర్ హుడిని ధరించి ఈ అన్ స్టాపబుల్ కి హాజరయ్యారు.ఇక పవన్ ధరించిన ఆ బ్లాక్ హుడి ఖరీదు ఎంత ఉంటుందని నెటిజెన్స్ ఆరా తీయడం ప్రారంభించారు. అయితే పవన్ కళ్యాణ్ ధరించిన ఈ బ్లాక్ హుడి హ్యూగో బాస్ అనే కంపెనీకి సంబంధించినది. ఈ హుడి ఖరీదు వేరే దేశాలలో అయితే 245 డాలర్లు. ఇక ఇండియన్ మార్కెట్ లో రూ.20 వేల నుండి రూ.27 వేల వరకు ఉంటుంది. ఇక ఈ విషయం తెలియడంతో నెటిజెన్స్ ఇంత ధరనా అని ఆశ్చర్యపోతున్నారు.

Also Read: ‘అన్ స్టాపబుల్’ షో.. పవన్ ఎపిసోడ్ లో బాలయ్య సెన్సేషనల్ కామెంట్స్..!

Previous articleనటుడు సుబ్బరాజు ఇంకా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏమిటో తెలుసా?
Next articleతెలుగులో ఒకే టైటిల్ తో విడుదలైన అయిన సినిమాలు ఏమిటో తెలుసా?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.