Ads
ఇళయరాజా ఆయన పాటలకి చాలా మంది అభిమానులు ఉన్నారు. సీనియర్ హీరో సినిమాలు ఈయన పాటలు లేకుండా పూర్తి అయ్యేది కాదు. ఇళయరాజా తమిళ్ వారు అయినా కూడా చాలా తెలుగు సినిమాలకి మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఎన్నో గుర్తుండిపోయే పాటలు ఇచ్చారు. ఇప్పుడు పాత తెలుగు పాటలన్నీ మనం గుర్తు చేసుకుంటూ ఉంటే, అందులో చాలా వరకు ఇళయరాజా పాటలు ఉంటాయి. అంతే కాకుండా, ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు పాడిన పాటలు గుర్తు చేసుకుంటున్నా కూడా అందులో చాలా వరకు ఇళయరాజా పాటలు ఉంటాయి. అయితే ఇళయరాజా గత కొంత కాలం నుండి కాపీ రైట్ అనే విషయం మీద చాలా కఠినంగా ఉన్నట్టు తెలుస్తోంది.
తన పాటలని స్టేజ్ షోస్ లో పాడకూడదు అని ఒక సమయంలో ఇళయరాజా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఒకవేళ పాడాలి అంటే తన అనుమతి తీసుకున్నాకే పాడాలి అని అన్నారు. ఇది ఎస్పీ బాలసుబ్రమణ్యం గారికి కూడా వర్తిస్తుంది అని చెప్పారు. తర్వాత ఇటీవల రజనీకాంత్ హీరోగా నటించిన కూలి సినిమాలో ఆయన పాత పాట ఒకటి వాడారు. ఆ పాటని ఇళయరాజా స్వరపరిచారు. తన అనుమతి లేకుండా తన పాట వాడినందుకు ఆ సినిమా మీద కూడా కేసు వేశారు. ఇప్పుడు ఇటీవల విడుదల అయ్యి సూపర్ హిట్ అయిన మంజుమ్మల్ బాయ్స్ సినిమా మీద ఇళయరాజా నోటీస్ ఇచ్చారు.
Ads
తన అనుమతి లేకుండా, ఈ సినిమాలో, గుణ సినిమాలోని కమ్మని ఈ ప్రేమలేఖనే పాటని వాడుకున్నారు అని ఇళయరాజా సినిమా బృందానికి నోటీసులు జారీ చేశారు. ఈ సినిమా బృందం తన అనుమతి తీసుకోవాలి అని, లేదు అంటే రాయల్టీ చెల్లించాలి అని చెప్పారు. లేకపోతే లీగల్ గా చర్యలు తీసుకుంటాను అని ఇలా రాజా సినిమా నిర్మాతలకి నోటీసులు పంపించారు. గతంలో కొన్నిసార్లు కూడా ఇళయరాజా తన పాటలని ఇతర సినిమాల్లో వాడినందుకు ఇలాగే నోటీసులు పంపించారు. అందులో కొన్ని మద్రాస్ హైకోర్టు వరకు కూడా వెళ్లాయి. అయితే కోర్టు వారు నిర్మాతలకి అనుకూలంగా తీర్పు ఇచ్చారు.
సాధారణంగా ఏ సినిమాకి అయినా కూడా, ఆ సినిమాలో పాటలు వాడుకోవాలి అంటే సంప్రదించాల్సింది నిర్మాతలని, వారి నుండి అనుమతి తీసుకున్నాక ఆ పాటని వేరే సినిమాలో వాడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మంజుమ్మల్ బాయ్స్ సినిమా బృందం కూడా నిర్మాతలని సంప్రదించాక, అందరి అనుమతి తీసుకున్నాక పాటని సినిమాలో వాడారు. సినిమా బృందం ఈ విషయం గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాము ఇళయరాజా నుండి కాపీ రైట్స్ తీసుకున్నాం అని చెప్పారు. ఇంత జాగ్రత్త తీసుకున్నాక కూడా ఇళయరాజా సినిమా బృందానికి ఇలా నోటీసులు పంపించడం అనేది చర్చనీయాంశంగా మారింది.
Team #ManjummelBoys Had Already Bought the Copyright For Kanmani Anbodu From Ilairaja.!!pic.twitter.com/6WrsaAmEDa
— Siddarth ツ 🧊🔥 (@TheCulpritVJ) May 23, 2024