హిట్ సినిమాలతో స్టార్ హీరో అయ్యాడు… కానీ ఇప్పుడు చేస్తున్న అన్నీ సినిమాలు ఆగిపోయాయి..? కారణం ఏంటి..?

Ads

సినిమా ఇండస్ట్రీ అన్నాక హిట్స్, ఫ్లాప్స్ అనేవి సహజం. ఎంతో మంది నటులు ఇవి ఎదుర్కొని, వాటన్నిటిని దాటుకొని ఈ స్థాయికి వచ్చారు. ప్రస్తుతం ఒక హీరో నటిస్తున్న సినిమాలు అన్నీ ఆగిపోయాయి. సినిమా మధ్యలో ఉన్నప్పుడు ఆగిపోతే అది చాలా బాధగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇటీవల హిట్ కొట్టిన దర్శకుడితో ఈ హీరో చేయాల్సిన సినిమా కూడా ఆగిపోయింది. రణవీర్ సింగ్. ఒక సమయంలో బాలీవుడ్ ని ఏలిన హీరో. ఏ సినిమా చేస్తే అది హిట్ అయ్యేది. డిఫరెంట్ రోల్స్ కి పెట్టింది పేరు అన్నట్టు అయన సినిమాల ఎంపిక ఉండేది.

this hero had flops

కానీ ఇటీవల పరాజయాలు వస్తున్నాయి. గత సంవత్సరం రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహాని సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు రణవీర్ సింగ్. ఈ సినిమాలో నటించిన అలియా భట్ కి పేరు వచ్చింది కానీ రణవీర్ సింగ్ కి అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు. కపిల్ దేవ్ బయోపిక్ గా వచ్చిన 83, డబుల్ యాక్షన్ చేసిన సర్కస్ సినిమా, అంతకుముందు వచ్చిన జయేష్ భాయ్ జోర్దార్ ఇవన్నీ కూడా నిరాశ పరిచాయి. కొంత కాలం క్రితం శంకర్ దర్శకత్వంలో అపరిచితుడు హిందీ రీమేక్ ప్రకటించారు. కానీ ఆ సినిమా ఆగిపోయింది. ప్రకటించిన వెంటనే ఈ సినిమా మీద చాలా కామెంట్స్ వచ్చాయి.

Ads

ఈ సినిమాని అప్పటికే అన్ని భాషల వాళ్ళు చూశారు. రీమేక్ చేయాల్సిన అవసరం ఏముంది అని అన్నారు. తర్వాత ఈ రీమేక్ ఆగిపోయింది. ఇప్పుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాక్షస్ అనే సినిమా వస్తుంది అని అన్నారు. ఈ సినిమా కోసం రణవీర్ సింగ్ హైదరాబాద్ కి వచ్చి ఒక ప్రోమో షూట్ కూడా చేశారు అని అన్నారు. కానీ క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఈ సినిమా ఆగిపోయింది అని అంటున్నారు. ప్రశాంత్ వర్మ ఈ సినిమా రణవీర్ సింగ్ తో చేయట్లేదు అనే వార్త వచ్చింది.

అసలు ఒక సినిమా ప్రకటించాక ఆగిపోవడం అనేది చాలా ఆలోచించాల్సిన విషయం. ఇలా అవ్వడానికి కారణాలు ఏంటో ఎవరికీ తెలియదు. ప్రస్తుతం రణవీర్ సింగ్ చేతిలో డాన్ 3 తప్ప వేరే సినిమాలు లేవు. అది కూడా ముందుకి కదలలేదు.  ఏదేమైనా కూడా రణవీర్ సింగ్ చాలా మంచి నటుడు. అయన ఆఫ్ స్క్రీన్ ప్రవర్తన మీద, దుస్తులు ధరించే విధానం మీద చాలా ట్రోల్స్ వస్తు ఉంటాయి. కానీ అయన నటనని మాత్రం ట్రోల్ చేసే అవకాశం రాదు. అంత బాగా నటిస్తారు. రణవీర్ సింగ్ హిట్ కొట్టాలి అని అందరు అనుకుంటున్నారు.

Previous articleఅనుమతి తీసుకున్నారా..? అయినా కూడా ఎందుకు ఇలా చేస్తున్నారు..?
Next articleRaju Yadav Review : “గెటప్ శ్రీను” కి సినిమాతో హిట్ పడినట్టేనా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.