Ads
త్రినయని సీరియల్ ద్వారా గుర్తింపు సంపాదించుకున్నారు నటి పవిత్ర జయరాం. ఈ సీరియల్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయ్యారు. ఈ సీరియల్ లో తిలోత్తమ అనే పాత్రలో పవిత్ర జయరాం నటించారు. ఎంతో మందికి ఈ పేరుతోనే సుపరిచితులు అయ్యారు. కొన్ని రోజుల క్రితం పవిత్ర ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. పవిత్ర చనిపోవడం సినీ నటులతో పాటు, ఎంతో మంది ప్రేక్షకులని దిగ్భ్రాంతికి గురి చేసింది. అప్పటి వరకు సీరియల్ లో తిలోత్తమగా కనిపించిన పవిత్ర ఇలా అవ్వడం ఏంటి అని అందరూ బాధపడ్డారు. సీరియల్స్ లో పవిత్ర ప్రయాణం అంత సులభంగా జరగలేదు. మొదట్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సరైన పారితోషకం వచ్చేది కాదు.
Ads
అయినా కూడా ధైర్యాన్ని కోల్పోకుండా తన ప్రయాణాన్ని కొనసాగించారు. ఒక్కొక్కసారి భోజనం పెట్టి పారితోషకం ఇవ్వకుండా పంపించేసేవారట. మొదట్లో కన్నడ సీరియల్స్ లో పవిత్ర నటించారు. ఆ తర్వాత తెలుగులో నిన్నే పెళ్ళాడుతా అనే సీరియల్ లో నటించారు. ఆ సీరియల్ పవిత్ర కి గుర్తింపు తీసుకొచ్చింది. ఆ సీరియల్ తర్వాత ఇప్పుడు త్రినయని సీరియల్ లో నటించారు. పవిత్ర తన చివరి కోరిక తీరకుండానే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. పవిత్ర కి డైరెక్షన్ చేయాలి అనే కల ఉండేదట. మొదట పవిత్ర అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ మొదలుపెట్టారు. ఆ తర్వాత నటిగా మారారు. పాటల డైరెక్షన్ తో మళ్ళీ డైరెక్షన్ మొదలుపెట్టారు. యాక్టింగ్ రాకపోతే డైరెక్టర్లు పవిత్రాన్ని తిట్టేవారట. అందుకే యాక్టింగ్ ఆ పట్టుదలతో నేర్చుకున్నారు.
ఒక సమయంలో పవిత్ర తెలుగు రాక చాలా ఇబ్బంది పడ్డారట. అలాంటి పవిత్ర తెలుగులో ఆ తర్వాత సాంగ్స్ డైరెక్ట్ చేశారు. ఎలాంటి ప్రాంప్టింగ్ లేకుండా పవిత్ర డైలాగ్స్ చెప్పేవారు. మొదటిసారిగా పవిత్ర ఆల్టో కార్ కొన్నారట. అప్పుడు తనకి ఏదో సాధించిన అంత గర్వంగా అనిపించింది అని అన్నారు. సినిమాల్లో నటించడం అంటే పవిత్రకి చాలా ఇష్టం ఉన్నా కూడా సీరియల్స్ చేయడంతో డేట్స్ కుదరలేదు అని చెప్పారు. త్రినయని సీరియల్ తనకి దేవుడు ఇచ్చిన వరం అని అన్నారు. ఎప్పటికైనా కూడా డైరెక్టర్ పవిత్ర జయరాం అనే పేరు రావాలి అని తన కల అని పవిత్ర ఒక ఇంటర్వ్యూలో అన్నారు. కానీ ఈ కల నెరవేరకుండానే పవిత్ర మరణించారు. పవిత్ర పట్ల సోషల్ మీడియా ద్వారా పలువురు ప్రముఖులు, ప్రేక్షకులు సంతాపం వ్యక్తం చేశారు.