బేకరీ నడుపుకునేవాడు హీరోయిన్ తో ప్రేమలో పడితే..? ఈ సిరీస్ చూశారా..?

Ads

సినిమాల్లో మాత్రమే కాదు. సిరీస్ లో కూడా రీమేక్స్ వస్తూ ఉంటాయి. ఎన్నో భాషల్లో హిట్ అయిన వెబ్ సిరీస్ ని మన తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు. అలా కొంత కాలం క్రితం ఒక వెబ్ సిరీస్ రీమేక్ చేశారు. ఒక ఇజ్రాయిల్ వెబ్ సిరీస్ ని తెలుగులో అదే పేరుతో రీమేక్ చేశారు. ఈ సిరీస్ పేరు ది బేకర్ అండ్ ది బ్యూటీ. తెలుగులో ఈ సిరీస్ కి జోనాథన్ ఎడ్వర్డ్స్ దర్శకత్వం వహించారు. సుప్రియ యార్లగడ్డ ఈ సిరీస్ ని నిర్మించారు.

web series with a different concept

సంతోష్ శోభన్, టీనా శిల్పరాజ్, విష్ణు ప్రియ, వెంకట్, సాయి శ్వేత, ఝాన్సీ, శ్రీకాంత్ అయ్యంగార్, సంగీత్ శోభన్ ఇందులో ముఖ్య పాత్రల్లో నటించారు. ప్రశాంత్ ఆర్ విహారి ఈ సిరీస్ కి సంగీతం అందించారు. ఇంక ఈ సిరీస్ కథ విషయానికి వస్తే, విజయ్ (సంతోష్ శోభన్) తల్లిదండ్రులు పద్మ (ఝాన్సీ), వెంకటేశ్వర్లు (శ్రీకాంత్ అయ్యంగార్) కి ఒక బేకరీ ఉంటుంది. విజయ్ కి తమ్ముడు విక్కీ (సంగీత్ శోభన్‌), చెల్లెలు మీరా (సాయి శ్వేత) ఉంటారు.

Ads

వీళ్ళకి ఒక సూపర్ మార్కెట్ కూడా ఉంటుంది. వీటి బాధ్యతలు విజయ్ చూసుకుంటూ ఉంటాడు. ఒకసారి విజయ్ ప్రముఖ మోడల్, సినీ నటి ఐరా వాసిరెడ్డి (టీనా శిల్పరాజ్) ని కలుస్తాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ స్నేహితులు అవుతారు. ఆ తర్వాత ప్రేమించుకుంటారు. వీళ్ళిద్దరివి వేరు వేరు జీవితాలుగా ఉంటాయి. అలాంటివారు ఎలా కలిశారు అనేది కథ. సిరీస్ సింపుల్ గా ఉంటూనే ఆసక్తికరంగా సాగుతుంది. మంచి ఫీల్ గుడ్ సిరీస్ ఇది. నటీనటుల పెర్ఫార్మన్స్ కూడా చాలా బాగుంటుంది.

హీరో వెంకట్ కూడా ఒక మంచి పాత్రలో నటించారు. ఇప్పుడు మ్యాడ్ సినిమా ద్వారా ఫేమస్ అయిన సంగీత్ శోభన్ ఈ సిరీస్ లో ఒక మంచి పాత్ర పోషించారు. కొన్ని సున్నితమైన అంశాల మీద ఇందులో మాట్లాడారు. ఆహాలో స్ట్రీమ్ అవుతున్న ఈ సిరీస్ పది ఎపిసోడ్లు విడుదల చేశారు. 2021 లో వచ్చిన ఈ సిరీస్ ఇంకా కొత్త వెబ్ సిరీస్ రావడానికి ఇన్స్పిరేషన్ గా నిలిచింది. అందుకే ఆ తర్వాత ఇంకా మంచి వెబ్ సిరీస్ లు వచ్చాయి. ఇంకా కొత్త కాన్సెప్ట్స్ ఆలోచిస్తున్నారు.

Previous articleకేవలం కళ్ళు మాత్రమే చూసి… ఈ టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో చెప్పగలరా..?
Next articleపవిత్ర జయరాం చివరి కోరిక ఇదేనా..? అది తీరకుండానే..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.