Ads
నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి, ఇప్పుడు తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న నటుడు నందమూరి బాలకృష్ణ. నందమూరి బాలకృష్ణ ఇప్పుడు కూడా యంగ్ హీరోలకి పోటీగా సినిమాలు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం బాలకృష్ణ నటించిన ఒక సినిమా అయినా విడుదల అవుతోంది. ఈ సంవత్సరం కూడా బాలకృష్ణ నటించిన సినిమా విడుదల అవుతుంది. బాలకృష్ణ స్క్రిప్ట్ కూడా హిట్ ఫార్ములా ఉండేలాగా చూసుకుంటున్నారు.
అందుకనే ఇటీవల సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న సినిమాల్లో బాలకృష్ణ సినిమాలు కూడా ఉంటున్నాయి. బాలకృష్ణ ఇతర హీరోలని కూడా ప్రోత్సహించడంలో ముందుంటారు. ఈవెంట్స్ కి వెళ్లి వారి గురించి మాట్లాడటం, వారి సినిమాని చూడమని అందరికీ చెప్పి ప్రోత్సహించడం చేస్తూ ఉంటారు. ఈ మధ్య టాక్ షో హోస్ట్ గా కూడా అందరినీ అలరిస్తున్నారు. బాలకృష్ణ రాజకీయాల్లో కూడా ఉన్నారు. హిందూపురంకి తన వంతు సహకారం అందించడానికి కృషి చేస్తున్నారు. అందుకనే ఇటీవల ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొన్నారు.
Ads
బాలకృష్ణ మంచి నటుడు మాత్రమే కాదు. మంచి మనసు ఉన్న వ్యక్తి కూడా. బసవతారకం హాస్పిటల్ ద్వారా ఎంతో మందికి సేవని అందిస్తున్నారు బాలకృష్ణ. జూన్ 10వ తేదీ బాలకృష్ణ పుట్టిన రోజు. ఆరోజు బాలకృష్ణ తన పుట్టినరోజుని బసవతారకం హాస్పిటల్ లో ఉన్న వారితో, పిల్లలతో సెలబ్రేట్ చేసుకుంటారు. వారిలో ఒకరిగా కలిసిపోయి తన పుట్టిన రోజు జరుపుకుంటారు. ఎంతో మంది సెలబ్రిటీలు కూడా బాలకృష్ణ సేవాగుణం గురించి చెప్పారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, బాలకృష్ణ తన అమ్మమ్మతో చాలా బాగా మాట్లాడారు అని చెప్పారు. యాంకర్ ఉదయభాను కూడా తన పిల్లల బర్త్ డే కి బాలకృష్ణ ని పిలిస్తే అంత బిజీ షెడ్యూల్ లో కూడా పుట్టినరోజుకి వెళ్లారు అని చెప్పారు.
ఎలాంటి సమయంలో అయినా సరే ఫోన్ చేసి సహాయం కావాలి అని అడిగితే ఆలోచించకుండా బాలకృష్ణ సహాయం చేస్తారు. ఈ విషయాన్ని ఎంతో మంది ప్రముఖులు చెప్పారు. బాలకృష్ణ చుట్టూ సెక్యూరిటీ సిబ్బంది ఉండరు. తన అభిమానులు తనకి ఆత్మీయులు అని, వారి నుండి తనకి రక్షణ కల్పించడానికి సెక్యూరిటీ సిబ్బంది అవసరం లేదు అని బాలకృష్ణ వారిని పెట్టుకోలేదు. తన అభిమానులకి బాలకృష్ణ అంత విలువ ఇస్తారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా బాలకృష్ణ తన వంతు కృషి చేస్తూ ఉంటారు.