Bhaje Vaayu Vegam Review : “కార్తికేయ” కి ఈ సినిమాతో హిట్ పడినట్టేనా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

Ads

గత సంవత్సరం బెదురులంక 2012 తో ప్రేక్షకుల ముందుకి వచ్చిన కార్తికేయ గుమ్మకొండ, ఈ సంవత్సరం భజే వాయువేగం సినిమాతో మనందరినీ పలకరించారు. ఇవాళ విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

  • చిత్రం : భజే వాయువేగం
  • నటీనటులు : కార్తికేయ గుమ్మకొండ, ఐశ్వర్యా మీనన్, తనికెళ్ల భరణి, రవిశంకర్, రాహుల్ టైసన్.
  • నిర్మాత : UV కాన్సెప్ట్స్
  • దర్శకత్వం : ప్రశాంత్ రెడ్డి
  • సంగీతం : రధన్
  • విడుదల తేదీ : మే 31, 2024

bhaje vayu vegam movie review

స్టోరీ :

వెంకట్ (కార్తికేయ), రాజు (రాహుల్ టైసన్), అన్నదమ్ములు. వీరి తండ్రి (తనికెళ్ల భరణి) ఒక రైతు. వీళ్లిద్దరూ కూడా ఒకరు క్రికెటర్ అవ్వడానికి, ఒకరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అవ్వడానికి సిటీకి వస్తారు. వెంకట్ అనుకోకుండా ఒక సమస్యలో చిక్కుకుంటాడు. అవతల వాళ్ళు వెంకట్ ని మోసం చేయడంతో, వెంకట్, రాజుతో కలిసి డేవిడ్ రవిశంకర్ కార్ ని దొంగతనం చేస్తారు. అసలు డేవిడ్ ఎవరు? ఆ కార్ లో ఏముంది? వెంకట్ ఎలాంటి సంఘటనలు ఎదుర్కొన్నాడు? అన్నదమ్ములు ఇద్దరు ఏం చేశారు? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.

రివ్యూ :

సినిమా చాలా నెమ్మదిగా మొదలవుతుంది. డైరెక్టర్ ప్రతి పాత్రని తెర మీద చూపించడానికి సమయం తీసుకున్నారు. మొదటి 20 నిమిషాల వరకు అసలు ఏం అర్థం కాదు. సినిమా అలా నడుస్తుంది. కానీ ఒక్కసారి సినిమా ముందుకు వెళ్లడం మొదలుపెట్టాక వేగం పెరుగుతుంది. సినిమాలో రాసుకున్న ట్విస్ట్ సీన్స్ బాగున్నాయి. సీన్స్ తెర మీద చూపించిన విధానం కూడా బాగుంది. సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ చాలా బాగా రాసుకున్నారు. ఇంక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, కార్తికేయ తన పాత్రకి బాగా సూట్ అయ్యారు. యాక్షన్ సీన్స్ లో చాలా బాగా నటించారు. చూడడానికి కూడా చాలా స్టైలిష్ గా ఉన్నారు.

Ads

యాక్టింగ్ విషయంలో కూడా కార్తికేయ గతంతో పోలిస్తే ఈ సినిమాలో చాలా మెరుగు పడ్డారు. ప్రతి సినిమాకి తనని తాను ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాలో వెంకట్ పాత్రలో చాలా బాగా నటించారు. రాజు పాత్రలో నటించిన రాహుల్ కూడా చాలా బాగా నటించారు. చాలా సంవత్సరాల తర్వాత రాహుల్ ని తెర మీద చూడడం బాగా అనిపిస్తుంది. దాదాపు హీరోతో సమానంగా ఉన్న రోల్ లో రాహుల్ నటించారు. హీరోయిన్ ఐశ్వర్య కి మంచి పాత్ర లభించింది. ఒక రకంగా చెప్పాలి అంటే సినిమాలో ఒక ట్విస్ట్ రావడానికి హీరోయిన్ పాత్ర కారణం అవుతుంది. కానీ ఇంకా కొంచెం బాగా రాసుకొని ఉంటే బాగుండేది అనిపిస్తుంది.

డేవిడ్ పాత్రలో రవిశంకర్ అయితే చాలా బాగా నటించారు. తనికెళ్ల భరణి కూడా తన పాత్ర పరిధి మేరకు నటించారు. రధన్ అందించిన పాటలు సినిమాకి తగ్గట్టు ఉన్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఆర్ డి రాజశేఖర్ అందించిన సినిమాటోగ్రఫీ ఫ్రెష్ గా అనిపించింది. దర్శకుడు ఎంచుకున్న స్టోరీ పాయింట్ మామూలుగా అనిపించినా కూడా, దానికి కొంచెం ఎమోషన్స్ యాడ్ చేసి తెర మీద బాగా చూపించారు. మొదటి 20 నిమిషాలు కూడా ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది అనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్ :

  • స్టోరీ పాయింట్
  • యాక్షన్ సీన్స్
  • సినిమాటోగ్రఫీ
  • సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని ట్విస్ట్ లు

మైనస్ పాయింట్స్:

  • స్లో గా స్టార్ట్ అయ్యే ఫస్ట్ హాఫ్
  • హీరోయిన్ పాత్ర డిజైన్ చేసిన విధానం

రేటింగ్ :

3/5

ట్యాగ్ లైన్ :

అక్కడక్కడ కొన్ని చిన్న చిన్న మైనస్ పాయింట్స్ ఉన్నా కూడా, అవి పెద్ద పట్టించుకునే విధంగా లేవు. ఇటీవల కాలంలో వచ్చిన మంచి యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాల్లో ఒకటిగా భజే వాయువేగం సినిమా నిలుస్తుంది.

watch trailer :

 

Previous articleGam Gam Ganesha Review : “ఆనంద్ దేవరకొండ” నటించిన ఈ సినిమా ఎలా ఉంది..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!
Next articleOTT లోకి వచ్చేసిన అల్లరి నరేష్ కొత్త సినిమా..! ఎలా ఉందంటే..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.