OTT లోకి వచ్చేసిన అల్లరి నరేష్ కొత్త సినిమా..! ఎలా ఉందంటే..?

Ads

అల్లరి నరేష్ అంటే కామెడీ టైమింగ్ గుర్తొస్తుంది. అలాంటి అల్లరి నరేష్, ఇటీవల ఆ ఒక్కటి అడక్కు సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఇప్పుడు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతోంది. ఇంక ఈ సినిమా కథ విషయానికి వస్తే, గణ అలియాస్ గణపతి (అల్లరి నరేష్) ఒక సబ్ రిజిస్టార్ ఆఫీస్ లో ఉద్యోగం చేస్తూ ఉంటాడు. తన తమ్ముడు (రవికృష్ణ)కి వాళ్ళ మేనమామ కూతురు అయిన దేవి (జెమీ లివర్)తో పెళ్లి చేస్తాడు. అలా గణపతి తమ్ముడికి గణపతి కంటే ముందే పెళ్లి జరుగుతుంది. గణపతి వయసు పెరిగిపోతూ ఉంటుంది. దాంతో 50 సంబంధాలు చూసినా కూడా పెళ్లి జరగదు. మ్యాట్రిమోనీ ద్వారా సిద్ధి (ఫారియా అబ్దుల్లా) పరిచయం అవుతుంది. గణపతి సిద్ధితో ప్రేమలో పడతాడు.

aa okkati adakku movie review

కానీ సిద్ధి గణపతికి తాను కరెక్ట్ కాదు అని చెప్పి రిజెక్ట్ చేస్తుంది. అయినా కూడా సిద్ధి, గణపతి స్నేహితులుగా ఉంటారు. ఆ తర్వాత సిద్ధి గురించి ఒక నిజం బయటికి వస్తుంది. అసలు సిద్ధి ఎవరు? తను అలా ఎందుకు చేసింది? నిజంగానే సిద్ధి డబ్బులు దోచుకునే పనులు చేసిందా? గణపతి ఈ విషయాలన్నీ ఎలా పరిష్కరించాడు? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.

Ads

సినిమా ట్రైలర్ చూస్తే ఇది ఒక ఎంటర్టైనర్ అని అర్థం అవుతోంది. సినిమా మొత్తం కూడా అలాగే సాగుతుంది. చాలా కాలం క్రితం రాజేంద్రప్రసాద్ గారు హీరోగా, ఈవీవీ సత్యనారాయణ గారి దర్శకత్వంలో ఆ ఒక్కటి అడక్కు అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే టైటిల్ తీసుకొని ఈ సినిమా తీశారు. కామెడీ పేరుతోనే ఈ సినిమాలో ఒక మెసేజ్ కూడా చెప్పడానికి ప్రయత్నించారు. సినిమా ట్రైలర్ చూసి సినిమా అంతా కామెడీగా ఉంటుంది అనుకుంటే మాత్రం పొరపాటే అవుతుంది. సినిమాలో ఒక సీరియస్ విషయం మీద కూడా డీల్ చేశారు.

పెళ్ళికాని వారి కష్టాలు ఎలా ఉంటాయి? ఆ కష్టాలని ఈ మ్యాట్రిమోనీ వాళ్లు ఎలా అడ్వాంటేజ్ గా తీసుకుంటారు అనే విషయాలని ఇందులో చూపించారు. ఒకరకంగా చెప్పాలి అంటే సినిమా సీరియస్ విషయం మీద నడుస్తుంది. కానీ ఆ విషయాన్ని కామెడీ యాడ్ చేసి చూపించారు. ఈ వీకెండ్ కి అందరూ కలిసి చూడదగ్గ మంచి సినిమాగా ఆ ఒక్కటి అడక్కు సినిమా నిలుస్తుంది.

Previous articleBhaje Vaayu Vegam Review : “కార్తికేయ” కి ఈ సినిమాతో హిట్ పడినట్టేనా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!
Next articleప్రసన్న వదనం క్లైమాక్స్ లో ఇలా ఎందుకు పెట్టారు..? దాని లాజిక్ ఇదేనా..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.