ఈ హీరో ఏంటి ఇలా అయిపోయాడు..? ఎవరో గుర్తుపట్టారా..?

Ads

నటన మీద కొందరి నటులకు ఉన్న శ్రద్ధ, తపన చూస్తే వీళ్లు నటన కోసమే పుట్టారు అనిపిస్తుంది. ఒక రేంజ్ లో ఉన్న హీరోలని చూసి చాలామంది వాళ్లకి అదృష్టం కలిసి వచ్చింది అంటారు కానీ నిజానికి వాళ్ల డెడికేషన్ వాళ్ళని ఆ స్థాయిలో నిలబెడుతుందని అనుకోరు. సినిమాలో క్యారెక్టర్ డిమాండ్ చేస్తే తమ బాడీని ఎలా మలుచుకోవటానికైనా సిద్ధంగా ఉంటారు ఇలాంటి నటులు. కమల్ హాసన్, విక్రమ్, విజయ్ ఆంటోనీ ఇలాంటి వాళ్ళందరూ సినిమాల కోసం తమని తాము మార్చుకున్న వారే. వాళ్ల తపన వాళ్ళని స్టార్ హీరోని చేసింది.

change in this hero

అలాగే ఇప్పుడు మరొక నటుడు పాత్ర కోసం 15 కేజీలు బరువు తగ్గి ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకుంటున్నాడు. పై ఫోటోలో డీ గ్లామరైజ్ గా కనిపిస్తున్న ఈ హీరోని గుర్తుపట్టారా ఇప్పటివరకు మనం మాట్లాడుకుంటుంది ఈ హీరో గురించే. వెర్సటైల్ యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఇతను ఏ పాత్ర ఇచ్చిన అందులో ఇమిడిపోతాడు. ఇతను కేవలం నటుడే కాదు మంచి  నిర్మాత అలాగే మంచి సింగర్ కూడా.

Ads

ఇంతకీ ఎవరు అనుకుంటున్నారా అయితేనేనండి మలయాళ స్టార్ హీరో టొవినో థామస్. మిన్నల్ మురళి, తల్లుమాల,2018 సినిమాలతో తెలుగు వాళ్ళకి కూడా దగ్గర అయ్యాడు ఈ నటుడు. 2018 సినిమాలో అయితే ఇతని నటన  చూసి అందరూ కన్నీరు పెట్టుకున్న వారే. కథలో కంటెంట్ హీరో నటన కలిపి ఈ సినిమాని ఆస్కార్ బరి లో నిలిపింది.

ఇప్పుడు తాజాగా ఈ హీరో నటించిన అదృశ్య జలకంగళ్ వాటర్ బ్యాక్ డ్రాప్ స్టోరీ తో నవంబర్ 24 న ధియేటర్లలో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ తో రికార్డుల వర్షం కురిపిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించారు. అయితే ఈ సినిమా కోసం టొమినో తన శరీరాన్ని 15 కేజీల వరకు తగ్గించాడు. ఇది డెడికేషన్ అంటూ అతనిని తెగ మెచ్చుకుంటున్నారు నెటిజన్స్.

Previous articleచూడాలని ఉంది నుంచి… భోళా శంకర్ వరకు… కోల్‌కతా బ్యాక్ డ్రాప్ తో వచ్చిన మూవీస్…
Next article7/G బృందావన్ కాలనీ హీరో “ఇలియానా” తో నటించారు అని తెలుసా..? ఈ సినిమా పేరు ఏంటంటే..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.