7/G బృందావన్ కాలనీ హీరో “ఇలియానా” తో నటించారు అని తెలుసా..? ఈ సినిమా పేరు ఏంటంటే..?

Ads

7/జి బృందావన్ కాలనీ సినిమా ద్వారా పరిచయం అయ్యారు హీరో రవికృష్ణ. రవికృష్ణ నటించిన సినిమాలు కొన్ని అయినా కూడా ప్రేక్షకులకి గుర్తుండిపోయారు. ముఖ్యంగా ఈ సినిమా ద్వారా అయితే ఇప్పటికి కూడా రవికృష్ణ గుర్తున్నారు. రవికృష్ణ ప్రముఖ ప్రొడ్యూసర్ ఏ ఎమ్ రత్నం గారి కొడుకు. 7/జి బృందావన్ కాలనీ సినిమాలో నటించే సమయానికి రవికృష్ణ వయసు కేవలం 21 సంవత్సరాలు మాత్రమే. మొదట ఈ సినిమా కోసం హీరో సూర్య అని అనుకున్నారు. కానీ తర్వాత ఈ సినిమాలో రవికృష్ణ చేశారు. రవి అనే పాత్రలో రవికృష్ణ నటించారు. ఇది నిజ జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా తీసిన సినిమా.

7g brundavan colony hero movie with ileana

ఈ సినిమా తర్వాత రవికృష్ణ కొన్ని సినిమాల్లో నటించారు కానీ అవి ఆశించిన గుర్తింపు తీసుకురాలేదు. అందులో కేడి అనే సినిమా కూడా ఒకటి. ఈ సినిమా తెలుగులో జాదు పేరుతో విడుదల అయ్యింది. ఈ సినిమాకి జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ఇలియానా, తమన్నా హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా చాలా తక్కువ మందికి తెలుసు. యువన్ శంకర్ రాజా అందించిన పాటలు అప్పట్లో చాలా పెద్ద హైలైట్ అయ్యాయి. తమన్నా ఇందులో విలన్ పాత్రలో నటించారు. ముందు తెలుగులో కూడా ఈ సినిమా రూపొందించాలి అని అనుకున్నారు.

Ads

కానీ తర్వాత డబ్బింగ్ చేసి విడుదల చేశారు. కానీ తెలుగులో కూడా పాటల క్వాలిటీ బాగుంటుంది. ఈ సినిమా 2006 లో వచ్చింది. చాలా తక్కువ మందికి ఈ సినిమా తెలుసు. ఈ సినిమా తర్వాత రవికృష్ణ 2008 లో డైరెక్ట్ తెలుగు సినిమాలో నటించారు. ఆ సినిమా పేరు బ్రహ్మానందం డ్రామా కంపెనీ. 2011 లో వచ్చిన అరణ్యకాండం సినిమాలో చివరిగా రవికృష్ణ నటించారు.

మళ్లీ ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత 7/జి బృందావన్ కాలనీ సినిమాకి సీక్వెల్ గా రూపొందుతున్న సినిమాలో రవికృష్ణ నటిస్తున్నారు. 7/జి బృందావన్ కాలనీ సినిమా ఇటీవల రీ-రిలీజ్ అయిన సందర్భంగా రవికృష్ణ మళ్లీ ఆడియన్స్ ముందుకి వచ్చారు. అప్పుడే కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చి ఈ సినిమాకి సీక్వెల్ వస్తున్నట్లు తెలిపారు. ఈ సినిమాలో అనస్వర రాజన్ హీరోయిన్ గా నటిస్తున్నారు.

Previous articleఈ హీరో ఏంటి ఇలా అయిపోయాడు..? ఎవరో గుర్తుపట్టారా..?
Next articleఈ సీరియల్ మీలో ఎంత మందికి గుర్తుంది..? దీని పేరేంటో చెప్పగలరా..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.