Ads
సినిమా ఇండస్ట్రీలో ఇవాళ గుర్తింపు తెచ్చుకున్న ప్రతి వాళ్లు సినిమాలతోనే కెరీర్ మొదలు పెట్టాలి అనే రూల్ లేదు. ఎంతో మంది షార్ట్ ఫిలిమ్స్ ద్వారా కెరీర్ మొదలు పెట్టిన వాళ్ళు కూడా ఉంటారు. అలా మెల్లగా సినిమాల్లోకి వస్తారు. కొంత మంది సీరియల్స్ ద్వారా కూడా మొదలుపెట్టి ఆ తర్వాత సినిమాల్లో గుర్తింపు తెచ్చుకుంటారు. సాధారణంగా సీరియల్స్ లో నటించిన వారికి సినిమాల్లో ఎక్కువగా అవకాశాలు రావు అనే అపోహ ఉంది. కానీ అది నిజం కాదు అని నిరూపించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు.
Ads
సీరియల్స్ ద్వారా నటన రంగంలోకి అడుగు పెట్టి, ఆ తర్వాత సినిమాల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు పైన ఫోటోలో ఉన్న వ్యక్తి కూడా అలాగే సీరియల్స్ ద్వారా కెరీర్ మొదలుపెట్టి, ఇప్పుడు భారతదేశంలోనే విలక్షణ నటుడు అని గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రకాష్ రాజ్ కి రాని భాష లేదు. ఏ భాషలో అయినా తనకు డబ్బింగ్ తనే చెప్పుకుంటారు. ఇలాంటి క్వాలిటీ కేవలం చాలా తక్కువ మంది నటులకి ఉంటుంది. వారిలో ప్రకాష్ రాజ్ ఒకరు. ప్రకాష్ రాజ్ ఏ భాష మాట్లాడినా కూడా ఆ భాష ఎంత బాగా మాట్లాడుతారు అంటే, ప్రకాష్ రాజ్ మాతృభాష కన్నడ అనే విషయం చాలామంది మర్చిపోతారు.
ఆ భాషలో ఉండే యాసని కూడా చాలా బాగా మాట్లాడుతారు ప్రకాష్ రాజ్. ప్రకాష్ రాజ్ కొన్ని కన్నడ సీరియల్స్ లో నటించారు. ప్రకాష్ రాజ్ అసలు పేరు ప్రకాష్ రాయ్. కర్ణాటకలో ప్రకాష్ రాజ్ ని ఇప్పటికి కూడా ప్రకాష్ రాయ్ అని పిలుస్తారు. ఆ తర్వాత సినిమాల్లో ప్రకాష్ రాజ్ అని పేరు మార్చుకున్నారు. ఒక రెండు సీరియల్స్ లో ప్రకాష్ రాజ్ నటించారు. అంతకుముందు స్టేజ్ షోస్ లో కూడా ప్రకాష్ రాజ్ పెర్ఫార్మ్ చేసేవారు. తర్వాత సినిమాల్లో ఎన్నో రకమైన పాత్రలు పోషించి ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారు. భారత దేశంలోనే గొప్ప నటుడు అని ప్రశంసలు అందుకున్నారు.