Ads
‘మాతృత్వం’ అనేది స్త్రీలకు దేవుడిచ్చిన వరం అని అంటారు. పిల్లలను దేవుడి బహుమతిగా భావిస్తారు. ఇంట్లో పిల్లలు తిరుగుతూ ఉంటే ఆ సందడి వేరుగా ఉంటుంది. పెళ్లి అయిన జంటని ఏడాది గడిస్తే చాలు తెలిసినవారు శుభవార్త ఎప్పుడు చెబుతారని అడుగుతుంటారు.
అయితే కొన్నేళ్ళ నుండి కొంతమంది పిల్లలను వద్దని అనుకుంటున్నారు. దానిని ‘చైల్డ్‌ఫ్రీ’ అని పిలుస్తున్నారు. దానికి ఎన్నో కారణాలు, ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. పేరెంట్‌హుడ్ వద్దని అనుకోవడం వల్ల వచ్చే నష్టాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
మనదేశంలో ఒకప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది. తాత, నానమ్మ, పెద్దనాన్న, చినాన్న, వారి పిల్లలు, పది, పదేహేను మంది ఒకే కుటుంబంగా సంతోషంగా జీవించేవారు. ఆ తరువాత చదువులు, వ్యాపారాలు, ఉద్యోగాల తదితర అవసరాలతో మెల్లమెల్లగా చిన్న కుటుంబాలు వచ్చాయి. సాధారణంగా వాటిలో అమ్మనాన్న ఇద్దరు పిల్లలు ఉంటారు. కానీ రాబోయే రోజుల్లో వాటి స్థానంలో భార్యభర్తలు మాత్రమే ఉండే ఫ్యామిలీలు కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దానికి కారణం స్త్రీ పురుషుల ఆలోచన విధానంలో వస్తున్న మార్పు అని చెప్పవచ్చు. ప్రస్తుత కాలంలో భార్యభర్తలు ఉన్నత చదువులు చదివి, మంచి జాబ్స్ చేస్తున్నారు. వారి కెరీర్ లో ఎదగడానికి, జీవితంలో మంచి పొజిషన్ లో సెటిల్ అవడం కోసం, మంచి లైఫ్ స్టైల్ కోసం పిల్లలను అప్పుడే వద్దని అనుకునే జంటలు ఉన్నారు. అయితే కొన్ని జంటలు మాత్రం పిల్లలను అసలే వద్దని భావిస్తున్నారని ఒక అధ్యయనంలో తేలింది.
Ads
తమ చిన్నతనంలో ఎదురైన పరిస్థితుల వల్ల, గర్భం మరియు ప్రసవం గురించిన భయాల వల్ల, ఆర్ధికంగా మంచి స్థితిలో లేకపోవడం వల్ల, ఇద్దరు కెరీర్ లో ఇంకా ఎదగాలని దానికి పిల్లలు అడ్డు అని భావించడం వల్ల కూడా పిల్లలను వద్దని అనుకుంటున్నారు. అయితే మనం ఎంచుకునే విషయం ఏది అయినా అందులో ప్రయోజనాలతో పాటుగా నష్టాలు కూడా ఉంటాయి. పిల్లలు లేకపోవడం వల్ల కలిగే నష్టాలు ఏమిటంటే..
1. ఎక్కడి కైనా వెళ్ళినప్పుడు లేదా చుట్టూ ఉండే ఫ్యామిలీలు లేదా ఫ్రెండ్స్ వారి పిల్లలతో ఉన్నప్పుడు ఆ గ్రూప్ నుండి పిల్లలు లేనివారు దూరంగా ఉండాల్సి వస్తుంది. లేదా అందులో కలవలేరు. వారు పిల్లల గురించి మాట్లాడుతూ ఉంటే మౌనంగా ఉండాల్సి వస్తుంది. సంతానోత్పత్తి సంవత్సరాలు ముగిసిన ఐదుగురు స్త్రీలలో ఒకరు ఇలా బాధపడుతున్నారని ఒక పరిశోధన సారాంశం.
2. కెరీర్ లో ఎంత ఎదిగినా, ఎంత డబ్బు సంపాదించిన ఒకానొక సమయంలో కొన్నిసార్లు ఏదో కోల్పోయామనే ఫీలింగ్ ఏర్పడుతుంది. చాలా ఏళ్ల తరువాత జాబ్ చేసి ఇంటికి వచ్చే సమయానికి ఎవరు లేని భావన, ఒంటరితనం అనే భావన ఏర్పడుతుందంట.
3. పిల్లలను వద్దని అనుకునేవారి జీవితంలో వారి వృద్ధాప్యంలో వారిని చూసుకోవడానికి ఎవరూ ఉండరు.
పిల్లలని వద్దు అనుకునే వారు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది.