Ads
డబ్బింగ్ సినిమాలతో తెలుగులో పేరు తెచ్చుకున్న నటుడు శివకార్తికేయన్. గత కొద్ది సంవత్సరాల నుండి శివకార్తికేయన్ నటించిన తమిళ్ సినిమాలు కూడా తెలుగులో విడుదల అవుతున్నాయి. అలా గత సంవత్సరం శివకార్తికేయన్ హీరోగా నటించిన మావీరన్ అనే సినిమా తెలుగులో మహావీరుడు పేరుతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ మీద నడుస్తుంది. ఇంక ఈ సినిమా కథ విషయానికి వస్తే, సినిమా కథ అంతా సత్య (శివకార్తికేయన్) అనే ఒక కార్టూనిస్ట్ చుట్టూ తిరుగుతుంది. సత్య తన తల్లి (సరిత), చెల్లి (మనీషా) తో కలిసి ఒక బస్తీలో నివసిస్తూ ఉంటాడు.
ఒక రోజు అక్కడ వాళ్ళందరినీ ఖాళీ చేయించి మినిస్టర్ ఫండ్ డబ్బుతో కట్టిన ఒక హౌసింగ్ బోర్డ్ అపార్ట్మెంట్ కాలనీకి తీసుకెళ్తారు. కానీ ఆ అపార్ట్మెంట్ లో గోడలకు పెచ్చులు రావడం, పగుళ్లు రావడం జరుగుతూ ఉంటాయి. దాంతో ఆ బిల్డింగ్ సరిగ్గా కట్టలేదు అని వారికి అర్థం అవుతుంది. సత్య ఈ విషయంపై పోరాడాలి అనుకుంటాడు కానీ తనలోని భయం తనని ఆపేస్తుంది. తన చెల్లెలిని ఒకరు వేధించినా కూడా వారిని తిరిగి ఏమీ అనలేకపోతాడు. ఒక రోజు పొరపాటున బిల్డింగ్ మీద నుండి కింద పడిపోతాడు. ఆ తర్వాత నుండి తనలో మార్పు మొదలవుతుంది.
Ads
తనకి పై నుండి ఒక గొంతు (రవితేజ) వినిపించడం మొదలవుతుంది. ఆ గొంతు భవిష్యత్తులో ఏమవుతుంది అనేది సరిగ్గా చెప్తూ ఉంటాడు. దాంతో సత్య ఎదురు తిరిగి మినిస్టర్ జయకోడి (మిస్కిన్) చేసే తప్పుడు పనులని అడ్డుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు సత్య కి వినిపించే ఆ గొంతు ఏంటి? ఆ గొంతు తను మాత్రమే ఎందుకు వింటాడు? ఆ తర్వాత సత్య ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే. కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేయడంలో శివకార్తికేయన్ ముందు ఉంటారు.
అలా ఎంతో మంది యంగ్ డైరెక్టర్స్ తో శివకార్తికేయన్ పని చేశారు. ఇప్పుడు అశ్విన్ తో పనిచేశారు శివకార్తికేయన్. అశ్విన్ అంతకుముందు మండేలా అనే ఒక సినిమా తీశారు. ఈ సినిమాలో యోగి బాబు ప్రధాన పాత్రలో నటించారు. కామెడీగా ఉంటూనే, ఒక మంచి మెసేజ్ ఉన్న సబ్జెక్ట్ మీద వచ్చిన ఈ సినిమాకి దేశవ్యాప్తంగా ఎన్నో ప్రశంసలు లభించాయి. ఇప్పుడు ఈ సినిమా ద్వారా కూడా ఒక మంచి మెసేజ్ ఇచ్చారు అంటూ సినిమా చూసిన వారు అభినందించారు.